శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 03, 2020 , 03:12:05

భక్తులు వేగంగా దర్శనం చేసుకోవాలి

భక్తులు వేగంగా దర్శనం చేసుకోవాలి


ములుగు జిల్లా ప్రతినిధి, ములుగు/నమస్తేతెలంగా ణ/ఏటూరునాగారం/తాడ్వాయి : మేడారం మహాజాతరకు వచ్చే సమ్మక్కసారక్క దేవతల దర్శనాలను సత్వరంగా చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇద్దరు మంత్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  ఈ సందర్భంగా వారు జాతరలో వేర్వేరుగా పర్యటించి భక్తులను సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. జాతరలో ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలను చేశారు. అనంతరం మంత్రులు మా ట్లాడుతూ భక్తులు వేగంగా తల్లులను దర్శించుకుని మిగతా వారికి ఇబ్బంది కలుగకుండా సహకరించాలని అన్నారు. తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ ప్రీ జాతర నిర్వహణకు సహకరించాలని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడకుండా అధికా రులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 


800 ఎకరాల విస్తీర్ణం గల చిలకలగుట్ట అటవీ భూముల హక్కు పత్రాలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఆలం రామ్మూర్తికి ఆదివారం సాయంత్రం మంత్రులు అందజేశారు. మే డారంలోని హంపీ థియేటర్‌లో నిర్వహిస్తున్న సాంస్కృక కార్యక్రమాలను వారు ప్రారంభించారు. ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రు లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అనుమతితోనే చిలుకలగుట్టకు అటవీహక్కుల చట్టం కింద  హక్కు పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇక చెట్టు, కర్ర కూడా కొట్టద్దని, అంతేకాకుండా దున్నుడు కూడా చేయవద్దని అన్నా రు. మరో వంద ఎకరాల భూమిని కూడా సేకరించి టూరి జం స్పాట్‌గా చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు పూజారులు సహకరించాలన్నారు. భూములు ఇవ్వడానికి ముం దుకు రావాలన్నారు. భూములకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఆదివాసీల సంస్కృతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని అన్నారు.  ఆదివాసీల జీవిత చరిత్ర తెలిపే విధంగా ప్రతి రోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 


భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ సమర్థవంతంగా జాతర నిర్వహిస్తారనే భావంతో నియమించామని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ రహిత జాతరగా తీర్చిదిద్దాలని కోరారు. ఆదిలాబా ద్‌ జిల్లా దండోరా నృత్యాలను ప్రదర్శించగా మంత్రులు తిలకించారు. అనంతరం జాతరలో కోర్టెవా కంపెనీకి చెం దిన వారు 1.5లక్షల క్లాత్‌బ్యాగులు, లక్ష మాస్క్‌లు ఉచితంగా అందచేయడానికి ముందుకు వచ్చారని పీవో చక్రధర్‌రావు వెల్లడించారు. జీవనది, ఎల్‌జీ కంపెనీలకు చెంది న వారు కూడా క్లాత్‌ బ్యాగులు అందచేయడానికి ముందు కు రావడంతో వారిని అభినందించారు. ఈ సందర్భంగా మేడారంలో నిర్మించిన వాటర్‌ ప్లాంట్‌, మిషన్‌భగీరథ, ఓవర్‌ హెడ్‌ ట్యాంకు, షెడ్‌లను మంత్రులు ప్రారంభించా రు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, జాతర ప్రత్యేకాధికారి గౌతం, గిరిజన సంక్షేమశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్పీ సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌, జెడ్పీ సీఈవో పారిజాతం, ఎఫ్‌డీవో ప్రదీప్‌కుమార్‌ శెట్టి, దేవాదాయశాఖ ఈవో రాజేంద్రం, సర్పంచ్‌ చిడం బాబురావు, చందా బాబారావు, సురేందర్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


బయటి నుంచే దర్శనం

ఇక గద్దెల పవిత్రతను కాపాడడంలో భాగంగా ఆదివా రం రాత్రి నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి ఎవరినీ అనుమతించకుండా ఉందామని  మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు అన్నారు. ఇందుకు సమ్మతమేనా అంటూ పూజా రులను ఆయన అడిగారు. కాగా, తాము కూడా గద్దెలపైకి ఎక్కకుండా మొక్కులు చెల్లిస్తామని, 7వ తేదీన సీఎం కేసీఆర్‌, రాష్ట్ర గవర్నర్‌కు మాత్రమే గద్దెలపైకి అనుమతి ఇద్దామని మంత్రి తెలిపారు. దీంతో ఆదివారం రాత్రి గద్దెలపైకి అనుమతి నిరాకరించారు. logo