శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 02, 2020 , 03:02:00

వనంలో జనం

వనంలో జనం
  • మేడారానికి భారీగా తరలివస్తున్న భక్తులు
  • శనివారం 1.50 లక్షల మంది రాక

తాడ్వాయి, ఫిబ్రవరి 1: వరాలిచ్చే దేవతలు, ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కను దర్శించుకునేందుకు శనివారం భక్తులు బారులుతీరారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1.50 లక్షల మంది తరలివచ్చారు. జంపన్నవాగులోని షవర్ల కింద స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తల్లులకు యాటపోతులు బలిచ్చి మొక్కులు చెల్లించారు. మేడారం-తాడ్వాయి, మేడారం-పస్రా, మేడారం-కాల్వపల్లి దారుల్లో అటవీప్రాంతంలో విడిది చేశారు. అటవీప్రాంతం భక్తులతో నిండిపోవడంతో వనంలో జన సందడి నెలకొంది. 


logo