మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 31, 2020 , 04:28:05

జాదరావుపేట సర్పంచ్‌ కుటుంబానికి ఆర్థికసాయం

జాదరావుపేట సర్పంచ్‌ కుటుంబానికి ఆర్థికసాయం

కాటారం, జనవరి30: మండలంలోని జాదరావుపేట సర్పంచ్‌ అరికిళ్ల ప్రమోద్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు గురువారం పరామర్శించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు రూ.25వేలు ఆర్థికసాయంగా పంపిన డబ్బులను డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య బాధిత కుటుంబానికి అందజేశారు. మండలంలోని సర్పంచ్‌లు సైతం రూ.35 వేలను ఆర్థికసాయంగా అందించినట్లు సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు దేవేందర్‌రెడ్డి, అశోక్‌, రాహుల్‌, రాజవ్వవెంకట్‌రెడ్డి, సరోజనరాజేశ్‌, రమేశ్‌రెడ్డి, అనూషరాజు, రవికుమార్‌, కిష్టమ్మరాజయ్య, లక్ష్మి, ఫిరోజ్‌ఖాన్‌, సంధ్యసురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo