గురువారం 04 జూన్ 2020
Mulugu - Jan 31, 2020 , 04:24:15

బొగ్గులవాగు వద్ద వనదర్శినికి శ్రీకారం..

బొగ్గులవాగు వద్ద వనదర్శినికి శ్రీకారం..
  • తొలిసారిగా కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థుల సందర్శన

మల్హర్‌, జనవరి 30: చారిత్రాత్మక సంపద కలిగి, ప్రకృతి సౌందర్యాలను అదిమిపట్టుకున్న బొగ్గులవాగు ప్రాజెక్టు వద్ద వనదర్శినికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎప్పుడూ తరగతి గదిలో ఉండే విద్యార్థులకు విజ్ఞాన యాత్రలు కూడా అవసరమని భావించిన ప్రభుత్వం అందుకోసం బొగ్గులవాగు ప్రాజెక్టును ఎంచుకుంది. విద్యార్థులకు విజ్ఞాన నైపుణ్యతను పెంపొందించి వారిలో మానసిక ైస్థెర్యం నింపడం కోసం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా గురువారం నుంచి తొలిఅడుగు పడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం పర్యవేక్షణలో  ఈ వనదర్శినికి తొలిరోజు మహాముత్తారం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థులను బొగ్గులవాగుకు సందర్శనకు తీసుకవచ్చారు. ఇక్కడి అడవుల ప్రాధాన్యత, ఔషథ మొక్కల పరిచయం, గడ్డి మైదానాల గురించి అటవీశాఖ అధికారి పురుషోత్తం, రేంజ్‌ ఆఫీసర్‌ అశోక్‌, వనదర్శిని నిర్వాహకులు శ్యాంసుందర్‌ విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జీవ వైవిధ్య వ్యవస్థ, ఔషథ వనాలు, వాటిని సంరక్షించుకునే విధానాలపై విద్యార్థులతో చర్చించారు. ఆ తర్వాత మైదానంలో విద్యార్థులకు ఆటవిడుపుకోసం ఐదు గ్రూపులుగాచేసి పర్యావరణ సంబంధిత క్విజ్‌ పోటీలను నిర్వహించారు. ఇందులో గెలిచిన విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్‌లైఫ్‌ సొసైటీ బాధ్యులు శ్యాంసుందర్‌, నరేశ్‌, బీట్‌ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo