సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jan 30, 2020 , 03:15:49

మేడారం జాతరకు రావాలి

మేడారం జాతరకు రావాలి

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ : తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడా రం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రావాలని కోరు తూ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ను ఆ హ్వానించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఆ శాఖ కార్యదర్శి బెనహర్‌ మహేశ్‌దత్‌ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోం గ్తూలు పోచంపల్లి చేనేత శాలువా కప్పి సంప్రదాయ వెం డికుంకుమ భరణిని అందించి 2020 మేడారం జాతర ఆ హ్వాన పత్రికను అందజేశారు. అలాగే తల్లుల ప్రసాదమైన బంగారాన్ని ఆహ్వాన పత్రికతోపాటు అందించారు. మే డారం చరిత్ర, విశిష్టతను తెలిపే విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించిన తీరును మంత్రి సత్యవతిరాథోడ్‌కు గవ ర్నర్‌కు వివరించారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతరలో చేపట్టిన కార్యక్రమాలు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌ నివారణకు తీసుకున్న చర్యల గురించి ఆమెకు వివరించారు. 


కేటీఆర్‌కు ఆహ్వానం పలికిన మంత్రులు..

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ ఆదివాసీ మహాజాతరకు రావాలని కోరు తూ టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పలికారు. మంత్రులు సత్యవతిరాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు ఈ మేరకు బుధవారం ఆయనను కలిసి మేడారం 2020 జాతర ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ జాతరలో జరుగుతున్న పనులతో పాటు మంత్రులు జాతర అభివృద్ధి పనులపై జరిపిన సమీక్షలపై కేటీఆర్‌కు వివరించారు.


logo