సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 29, 2020 , 03:11:29

లక్నవరం అందాలు అద్భుతం

లక్నవరం అందాలు అద్భుతం

గోవిందరావుపేట, జనవరి28: ‘లక్నవరం అందాలు చూస్తుంటే ఎక్కడో విదేశ ఆందాలు చూస్తున్నట్లు ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో సరస్సు, సరస్సులోని నీటిలో బోటు షికారు చేస్తుంటే ఎంత ఆనందంగా ఉందని’ రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ డీ రాజేశంగౌడ్‌ అన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో లక్నవరం సరస్సును కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా వేలాడే వంతెనలపై నడుస్తూ బోటులో షికారు చేస్తూ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కొన్నేళ్ల క్రితం లక్నవరం రాగా  ఇంత అభివృద్ధి లేదని, నేడు ఎంతో అభివృద్ధి  చెంది పర్యాటకులను మంత్ర ముగ్థులను చేస్తోందన్నారు. ఫిబ్రవరి 5 నుంచి జరిగే మేడారం జాతర దృష్ట్యా పోలీసులు ముందస్తుగానే లక్నవరం సందర్శనను నిలిపివేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారన్నారు.  దీనిపై పోలీసులు పునరాలోచించి లక్నవరం సందర్శనను నిలపకుండా చూడాలని కోరారు. ఈ విషయంపై మంత్రి, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అంతకుముందంప రాజేశంగౌడ్‌కు లక్నవరం యూనిట్‌ మేనేజర్‌ పుల్లారెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 

నేడు గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ 

ములుగురూరల్‌, జనవరి28:  జిల్లా కేంద్రం పరిధిలోని ఆదిదేవత గట్టమ్మకు ఆదివాసీ నాయపోడు పూజారులు బుధవారం ఎదురుపిల్ల పండుగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి 12 గంటలకు (బుధవారం తెల్లవారు జామున)  కొల్లారి(గుడి) శుద్ధి చేసి అమ్మవారికి ఏడు బావుల నీళ్లతో గంగా స్నానం చేయించనున్నారు.  అనంతరం నూతన వస్ర్తాలతో అలంకరించనున్నారు.  నేడు ఉదయం తెల్లవారు జామున ములుగు ఆదివాసీ నాయకపోడులకు చెందిన 105 కుటుంబాలు ఇంటింటికీ భోనాలతో జిల్లా కేంద్రం నుంచి వారి ఇలవేల్పు లక్ష్మీదేవరతో గట్టమ్మ గుడికి చేరుకోనున్నారు. అనంతరం ఎదురు పిల్లను అందించనున్నారు. 


logo