శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jan 29, 2020 , 03:07:11

రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపితే చర్యలు

రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపితే చర్యలు

ములుగు, నమస్తేతెలంగాణ:   మేడా రం జాతర సందర్భంగా జిల్లా కేంద్రం లో రోడ్లపై ఇష్టానురాజ్యంగా వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య అన్నారు. ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రానికి రెండు టోయింట్‌ వెహికిళ్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ వాహనాలతో  ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నిలిపే వాహనాలను  తరలించనున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే వాహనదారులు తమ వంతు బాధ్యతగా ఒకే లైన్‌ లో రావాలని విజ్ఞప్తి చేశారు. మేడారం జాతర ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 టోయింగ్‌ వాహనాలను అందుబాటులో ఉంచామని, మరో 6 వాహనాలు జాతరలో సేవలు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 200 మొబైల్‌ వాహనాలను అందుబాటులో ఉంచి వీటి ద్వారా నిత్యం ట్రాఫిక్‌ రద్దీని నియంత్రిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉండే వాహనాలను టోయింగ్‌ వెహికిళ్ల ద్వారా పక్కన పెట్టనున్నట్లు తెలిపారు. భక్తులు పోలీస్‌ శాఖకు సహకరించి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా తమ వంతు బాధ్యత పోషించాలని ఏఎస్పీ సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు.


logo