శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jan 28, 2020 , 05:15:07

సమన్వయంతో విధులు నిర్వహించాలి

సమన్వయంతో విధులు నిర్వహించాలి

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: మేడారం జాతరలో అధికారులు, ఉద్యోగులు సమర్థవంతంగా, సమన్వయంతో విధులు నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదేశించారు. సెక్టోరల్‌ అధికారులు, సహాయక అధికారులకు సోమవారం రెండో విడత శిక్షణ ఇచ్చారు. మేడారంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని సూచనలిచ్చారు. జాతర విధులను నిర్వహించే అధికారులు ఫిబ్రవరి 1వ తేదీన మేడారంలోని ఇంగ్లిష్‌ మీడి   యం పాఠశాలలో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. సెక్టార్ల వారీగా టేబుళ్లు, కుర్చీలు, తదితర సామగ్రిని సెక్టోరల్‌ అధికారులు తీసుకోవాలని, విధులకు వచ్చిన అధికారులు, సి బ్బందికి వసతి, భోజన సదుపాయంలో సమస్యలు లేకుం డా చూడాలని ఆదేశించారు. తమకు కావాల్సిన శాఖాపరమైన అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రిపోర్టు చేసిన సెక్టార్‌ అధికారులకు వైర్‌లెస్‌ సెట్లు, సిమ్‌కార్డులు, మొబైళ్లు, సబ్బులు ఇతర సామగ్రి కిట్లను అందిస్తారని తెలిపారు. సెక్టార్‌ అధికారులు తమ సెక్టార్‌కు సంబంధించిన పూర్తి అవగాహన పెంచుకోవాలని, పూర్తిగా పరిశీలించి, లోటుపాట్లను సరిచేసుకోవాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్‌ స్థలాలు, క్యూలైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కోర్‌ ఏరియా విధులు నిర్వహించే అధికారులు ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సైతం ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాస్‌లు వాడొద్దన్నారు. అధికారులు, మీడియాకు ఒక రోజు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. 

మర్యాదగా ప్రవర్తించాలి

జాతరకు వచ్చే భక్తులతో అధికారులు, సిబ్బంది సహనంతో, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు సూచించారు. అధికారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు తల్లులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించాలని సూచించారు. ప్రతి అధికారి తమ సెక్టార్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మేడారం అధికారిక యాప్‌పై అవగాహన కల్పించారు. డీఆర్వో కే ర మాదేవి, జెడ్పీసీఈవో పారిజాతం, మేడారం ఈవో రాజేం ద్రం, సెక్టార్‌ అధికారులు, సహాయ అధికారులున్నారు.


logo