శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Jan 28, 2020 , 05:13:28

పూరేడు గుట్ట జాతర కమిటీ నియామకం

పూరేడు గుట్ట జాతర కమిటీ నియామకం

చిట్యాల, జనవరి 27 : మండలంలోని వెంచరామి గ్రామ శివారులో జరిగే మినీ మేడారం జాతరను విజయవంతం చేసేందుకు జాతర కమిటీని నియమించినట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, కమిటీ సభ్యులుగా మల్లారపు మురలి, కిత్తపల్లి జగదీశ్వర్‌, గోస్కుల రమేశ్‌, కరడ్లపల్లి మమత, పొలం తిరుపతి, పొలం సమ్మయ్యలను నియమిస్తూ భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో ఉత్తర్వులు జారీ చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, జెడ్పీటీసీ గొర్రె సాగర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు రాజ్‌మహ్మద్‌, నాయకులు జెన్నె యుగేందర్‌, రవీందర్‌రావు, పులి అంజిరెడ్డి, సంజీవ్‌, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ల అందజేత..

టేకుమట్ల : గ్రామ అభివృద్ధికి టాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వెంకట్రావ్‌పల్లి, గర్మిళ్లపల్లి గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను భూపాలపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఆ గ్రామాల సర్పంచ్‌లు నేరెళ్ల శ్రీనివాస్‌, నల్లబెల్లి రమారవీందర్‌లకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లడుతూ.. గ్రామంలోని చెత్తను డంపింగ్‌, రోడ్లను చదును చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ టాక్టర్లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ  కార్యక్రమంలో సర్పంచ్‌లు పొలాల సరోత్తంరెడ్డి, పండుగ శ్రీను, ఆది రఘు, కార్యదర్శులు పాల్గొన్నారు.logo