సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 28, 2020 , 05:07:29

మోడల్‌ పండ్ల మార్కెట్‌పై ఎమ్మెల్యే సమీక్ష

మోడల్‌ పండ్ల మార్కెట్‌పై ఎమ్మెల్యే సమీక్ష

వరంగల్‌ చౌరస్తా, జనవరి 27: వరంగల్‌ లక్ష్మీపురం పండ్ల మర్కెట్‌ను మోడల్‌ మార్కెట్‌గా నిర్మించేందుకు వరంగల్‌ తూర్పు ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్‌ చింతం సదానందం, వరంగల్‌ చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామితో కలిసి సమావేశం నిర్వహించారు. ఆధునిక హంగులతో మోడల్‌ పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి కావలసిన ప్రణాళికలను రూపొందించిన ట్లు అధికారులు తెలిపారు. వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. మార్కెట్‌ ఆవరణలో రైతులకు విశ్రాంతి గదులు, మార్కెట్‌కు వచ్చే సరుకులను తూకం వేయడానికి అధునాతన వే బ్రిడ్జి నిర్మాణంతో పాటుగా మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి సంగయ్య, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.logo