మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jan 27, 2020 ,

లక్నవరం ఫెస్టివల్‌ అద్భుతం

లక్నవరం ఫెస్టివల్‌ అద్భుతం

గోవిందరావుపేట, జనవరి 26 : ఏకోటూరిజం, అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్నవరం ఫెస్టివల్‌ చాలా అద్భుతంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన గోద్రేజ్‌ కంపెనీ, నాగార్జున సిమెంట్‌ కంపెనీకి చెందిన ఉద్యోగులు కితాబ్‌ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఫెస్టివల్‌లో పాల్గొన్న వారు ట్రెక్కింగ్‌, బోటు, సఫారీ షికారు, నైట్‌ క్యాంపెయిన్‌లో పాల్గొని తమ  అనుభూతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా పస్రా రేంజ్‌ అధికారిణి మాధవి శీతల్‌ ఫెస్టివల్‌ విషయాలపై వారికి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి సాంబయ్య, బీట్‌ ఆఫీసర్లు దీప్‌లాల్‌ ప్రతిభ, శ్రీలత, ఏకో టూరిజం ప్రమోటర్లు వంశీ, మోహన్‌, సుధాకర్‌తోపాటు పలువురు ఉన్నారు. 

పర్యాటకులు ఫిదా..

పర్యాటక ప్రాంతమైన లక్నవరం సర స్సు వద్ద పర్యాటకులు అందాలను తిలకి స్తూ ఫిదా అయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు. వేలాడే వంతెనలపై నడుస్తూ బోటులలో షికారు చేస్తూ సరస్సు అందాలను తిలకిస్తూ మంత్రముగ్ధులయ్యారు. సాయం త్రం వేళలో పర్యాటకులు ఒక్క సారిగా భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో అటవీ సిబ్బంది రెండు గంటలపాటు చల్వాయిలోని లక్నవరం క్రాస్‌ వద్ద రహదారిని మూసివేసి అనంతరం సందర్శనకు అనుమతించారు. 


logo