సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 27, 2020 , 03:15:48

తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

తాడ్వాయి/వాజేడు/జనవరి 26 : వనదేవతలైన సమ్మక్క-సారక్కల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సీఎం కేసీఆర్‌ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎ మ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. ఆదివారం వారు కుటుంబ సమేతంగా అ మ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన వారికి అమ్మవార్ల పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలివాయిద్యాల నడుమ ఘన స్వాగ తం పలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకెళ్లారు. గద్దెల వద్ద గిరిజన సంప్రదాయ పద్ధతులలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తల్లులకు ఎదరుకోళ్లను ఎగురవేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నరేందర్‌, శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ తల్లుల దీవెనలతో రాష్ట్రమంతా సంతోషంగా ఉందన్నారు.  


logo