గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jan 26, 2020 , 04:00:28

గులాబీ నవరత్న గణతంత్రం

  గులాబీ నవరత్న గణతంత్రం
  • - మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా
  • - ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది పురపాలక సంఘాలు క్లీన్‌స్వీప్‌
  • - గల్లంతైన ప్రతిపక్షాలు
  • - భూపాలపల్లి, మరిపెడలో కాంగ్రెస్‌ శూన్యం
  • - అక్కడక్కడా ఉనికి చాటుకున్న బీజేపీ
  • - అద్భుతమైన సమన్వయం-అనితరసాధ్య విజయం

టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురేలేదని మరోసారి తేలిపోయింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 200 వార్డుల్లో 134 కైసవం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ మరోసారి సత్తా చాటగా, కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. జనగామ, మహబూబాబాద్‌లో ఆ పార్టీ పదేసి చొప్పున స్థానాలను మాత్రమే తెచ్చుకోగలిగింది. మరిపెడ, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో చతికిలపడింది. బీజేపీ నాలుగు మున్సిపాలిటీల్లో 10 వార్డులు తెచ్చుకుంది. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలోని నెరపిన సమన్వయం, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేల కృషితో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌  ప్రభంజనం కొనసాగింది.

(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ):  టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురేలేదని మరోసారి తేలిపోయింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరొసారి స్పష్టమైంది. గత మున్సిపల్‌  ఎన్నికలకు ఈసారి మున్సిపల్‌కు మధ్య కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. జనగామ, మహబూబాబాద్‌లో మినహా ఆ పార్టీ పదేసి చొప్పున స్థానాలకు మాత్రమే తెచ్చుకోగలిగింది. మరిపెడ, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో కనీసం ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. ఇక టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని గంభీర ప్రకటనలు చేసిన బీజేపీ నాలుగు మున్సిపాలిటీల్లో కనీసం ఖాతా కూడా తెరకుండా కమలం వెలవెల బోయింది.  మహబూబాబాద్‌ మున్సిపాలిటీల్లో ఒకప్పుడు బలమైన, నిర్ణయాత్మక పాత్ర పోషించిన ఎరుపు గులాబీ మెరుపు ముందు నిలబడలేకపోయాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు తొమ్మిదిట్లోనూ టీఆర్‌ఎస్‌ ఎవరి సహకారం లేకుండా సునాయాస విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు మూకుమ్మడిగా లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకొని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బతీయాలని పథకరచన చేసినా ప్రజలు టీఆర్‌ఎస్‌నే తమ ఇంటిపార్టీగా మరోసారి విశ్వసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారధ్యంలోని నెరపిన సమన్వయం, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతీ రాథోడ్‌, ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు సమష్టి సమన్వయంతో ముందుకు సాగి అపూర్వ విజయాన్ని సాధించడంలో తోడ్పాడును అందించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్దన్నపేట, మహబూబాబాద్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూర్‌, మరిపెడ, డోర్నకల్‌, జనగామ జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీ ఇలా ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు  సునాయాస విజయాన్ని సాధించారు. ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని, తమ పార్టీపై, తమ ప్రభుత్వంపై  ఎవరెన్ని చెప్పినా ప్రజలు వినకుండా టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మున్సిపాలిటీలను బహుమానంగా ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు తామే అభ్యర్థులుగా నిలిచామని భావించి కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. కాగా, పల్లె, పట్నం అన్న తేడా లేకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఊరూరా సంబురాలు చేసుకున్నారు. పటాకులు పేల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

నవరత్న గణతంత్రం

గణతంత్ర దినోత్సవం ఒకరోజు ముందున్నదనగా ప్రజాస్వామ్య విజయంలో, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనేది కీలకమైన అంశం. స్థానిక సంస్థల్లో ప్రత్యేకించి పురపాలనలో పౌరభాగస్వామ్యం ఏ పార్టీకి మద్దతు ఉందనేది కీలకంగా మారుతుంది. నిజానికి ఇదొక విశేష సందర్భమే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీ పాలన వ్యవహారాల్లో టీఆర్‌ఎస్‌ ‘నవ’రత్నాలుగా వెలుగొందే అపురూపు  విజయసన్నివేశం ఆవిష్కృతం కావడం విశేషం. టీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే బలంగా ఉందని,పట్టణ ప్రాంతాల్లో అంతంత మాత్రమే ఉందని ఆరోపించి ప్రచారం చేసిన పార్టీలకు చివరికి ప్రజలు ఆ ఆరోపణలు అవాస్తవమని తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా విస్తరించిన పార్టీ అని, బలమైన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందిన పార్టీఅని తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపాలిటీలపై గులాబీ జెండ ఎగురవేయడం విశేషం.

బలమైన నాయకత్వం

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో అజేయమైన రాజకీయ శక్తిగా మరోసారి తన సత్తాను చాటుకుంది. జాతీయ పార్టీలు స్థానిక సమస్యల పరిష్కారంలో అంత చొరవ చూపవని ప్రజలు తీర్పిచ్చిన ఎన్నికలుగా ఈ మున్సిపల్‌ ఎన్నికలు నిలిచాయి. సాధారణంగా రాష్ట్రంలో అధికారంలోఉన్న పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ విషయంలో ఆ సూత్రీకరణలు చెల్లవని ప్రజలు ఓటేసి మరీ చెప్పారు. రాష్ర్టాన్ని సాధించిన పార్టీగానే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు కష్టపడే పార్టీగా ఒక్కమాటలో చెప్పాలంటే టీఆర్‌ఎస్‌ను ప్రజలు తమ ఇంటి పార్టీగా భావించడం వల్లే స్థానిక సంస్థ ఎన్నికల్లో వ్యక్తుల ప్రమేయం కంటే పార్టీ ప్రధానమని స్పష్టం చేసిన ఎన్నికలుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బలమైన నాయకత్వం పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు విస్తరించిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించారు. ఆ విశ్వసించడంలో భాగంగానే ఈ అద్భుత ఫలితాలు వచ్చాయని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.

ఓటు బుల్లెట్‌

ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు రాజకీయ పార్టీలు గతంలో ఈవీఎంలు టాంపరింగ్‌ జరుగుతున్నాయని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు అధికంగా వస్తున్నాయని విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్‌ ఆరోపించింది. అయితే అది కేవలం సత్యదూరమని తమ ఓటమిని అంగీకరించకుండా, తమ బలహీనతను ఒప్పుకోకుండా చేస్తున్న ప్రకటనలేనని పటాపంచలైన ఎన్నికలుగా నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలు గానీ, ఇవ్వాల్టి మున్సిపాలిటీ ఎన్నికలు గానీ తేటతెల్లం చేశాయి. బ్యాలెట్‌ పోరైనా, యంత్రపు పోరైనా (ఈవీఎం) ప్రజలు ఆరోపించిన పార్టీలకు బుల్లెట్‌లాంటి ఓటుతో సమాధానం చెప్పినట్లయిందని టీఆర్‌ఎస్‌ పార్టీ పేర్కొంది.


తాజావార్తలు


logo