శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jan 25, 2020 , 02:16:14

పుర్తికావస్తున్న జాతర పనులు

పుర్తికావస్తున్న జాతర పనులు
  • - మేడారంలో భక్తులకు సౌకర్యవంతంగా స్నానఘట్టాలు
  • -దర్శనానికి క్యూలైన్లు సిద్ధం
  • -అందుబాటులో వైద్య సేవలు
  • -భక్తుల రవాణాకు ఆర్టీసీ సన్నద్ధం
  • - పార్కింగ్‌ స్థలాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు
  • -ముస్తాబైన గిరిజన మ్యూజియం
  • -రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న హరితహోటల్‌ములుగు, నమస్తే తెలంగాణ/తాడ్వా యి/ ములుగుటౌన్‌, జనవరి 24 : ఆసి యా ఖండంలోనే అతిపెద్ద జాతర అయి న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తుల కోసం ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి. శుక్రవారం నాటికి 90 శాతం పనులు పూర్తయియ్యాయి. భక్తు ల సౌకర్యార్థం మెరుగైన వసతుల కల్పన కు ప్రభుత్వం కేటాయించిన రూ.75 కోట్ల నిధులతో వివిధ శాఖల ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కాగా, ఆయా  పనులను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావస్తున్నాయి. జనవరి 31వ తేదీ నాటికి 100శాతం పనులను పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు జి ల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో స న్నద్ధమైంది. ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడకుం డా పస్రా నుంచి మేడారం వైపు, తాడ్వా యి నుంచి మే డారం వైపు వెళ్లే రహదారులతోపాటు జాతరకు చేరుకునే అన్ని మార్గాలకు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ సమ స్యలు ఏర్పడకుండా వాహనాలను నిలిపేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో పా ర్కింగ్‌ స్థలాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు.

పార్కింగ్‌ స్థలాల్లో భక్తుల సౌకర్యార్థం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో చే పట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భక్తులకు మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువచ్చి పారిశుధ్య కార్మికులను సైతం నియమించా రు. జంపన్నవాగు వద్ద వాగుకు ఇరువైపులా రెం డు కిలో మీటర్ల మేర స్నానఘట్టాలకు  బ్యా టరీ ట్యాప్‌లను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా బ్యాటరీ ట్యాప్‌లను ప్రత్యేక జనరేటర్లను ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. అదేవిధంగా స్నాన ఘ ట్టాల వద్ద  మహిళలు దుస్తులు మా ర్చుకునేందుకు ప్రత్యేకంగా చాటుగదులను ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనానికి ఇ బ్బంది కలుగకుండా అన్ని వైపుల నుం చి క్యూలైన్‌లను సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ముంద స్తు మొ క్కుల్లో భాగంగా  భక్తుల రద్దీ పెరుగుతు న్న దృష్ట్యా దేవాదాయ శాఖ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్య లు చేపట్టింది.

ఈ సారి హెలికాప్టర్‌ సేవలు బంద్‌..

గత జాతరలో భక్తులను తరలించేందుకు హెలికాప్టర్‌ సేవలను సైతం వినియోగించారు. ఈ ద ఫా జరిగే జాతరలో హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో లేన ట్లు తెలుస్తుంది. అధికారులు దానికి తగినట్లు ఏర్పాట్లు చేయడం లేదు. గతంలో సేవలను అధిక సంఖ్యలో భక్తులు వినియోగించుకోనందున ఈ సంవత్సరం జరిగే జాతరకు ఎవరు సేవలు అందించేందుకు ముందుకు రానట్లు తెలిసింది. 

భక్తులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు..

జాతరకు హాజరయ్యే భక్తులను అలరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహంచనున్నారు.  గిరిజన మ్యూజియంలో జాతర విశిష్టతను తెలి పే విగ్రహాలకు ఈ దఫా నూతన అలంకరణతో  ముస్తాబు చేస్తున్నారు. జాతర లో రంగులరా ట్నం, చిన్నారుల కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ఒంటెలు ప్రత్యేక ఆకర్శణగా నిలువనున్నా యి. భక్తులకు రహదారుల వివరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను సైతం ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.logo