మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 25, 2020 , 02:15:29

ఈఎస్‌ఎస్‌ గ్రౌండింగ్‌లో నిర్లక్ష్యం వద్దు

 ఈఎస్‌ఎస్‌ గ్రౌండింగ్‌లో నిర్లక్ష్యం వద్దు
  • - ట్రైకార్‌ డీజీఎం శంకర్‌రావు
  • - ఉమ్మడి జిల్లా డీటీడీవోలు, బ్యాంకర్లు, ప్రత్యేకాధికారులతో సమీక్ష

ఏటూరునాగారం, జనవరి 24 : ఈఎస్‌ఎస్‌ (ఎకనామికల్‌ సపోర్టు స్కీం)యూనిట్ల గ్రౌండింగ్‌లో నిర్లక్ష్యం తగదని, నిరుపేద గిరిజనులకు సకాలంలో ఈ యూనిట్లు అందించాలని ట్రైకార్‌ డీజీఎం శంకర్‌రావు ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని డీటీడీవోలు, బ్యాంకర్లు, ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలతో శుక్రవారం సమీక్షించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 2014-15 నుంచి 2017-2018వరకు మంజూరు చేసిన ఈఎస్‌ఎస్‌ గ్రౌండింగ్‌పై సమావేశం నిర్వహించారు. సబ్సిడీ విడుదలైనప్పటికీ కొందరు బ్యాంకర్లు గ్రౌండింగ్‌ చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రౌండింగ్‌ అధికారులు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అందజేయడంలో జరిగిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల సబ్సిడీ విడుదల కావడం, సకాలంలో యూనిట్లు లబ్ధిదారులకు అందించకుండా జాప్యం చేయడం తదితర వివరాలు వెల్లడయ్యాయి. వెంటనే యూనిట్లు గ్రౌండింగ్‌ చేసి పెండింగ్‌ పెట్టకుండా వారం రోజుల్లో యూసీలు అందజేయాలని ఆయన సూచించారు. గ్రౌండింగ్‌ ఫొటోతో పాటు యూసీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. బ్యాంకుల వారీగా పెండింగ్‌లో ఉన్న యూనిట్ల వివరాలను ఆయన సేకరించారు. గిరిజనులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా యూనిట్లు అందజేయాలని సూచించారు. సమావేశంలో స్టేట్‌మిషన్‌ మేనేజర్‌ లక్ష్మీ ప్రసాద్‌, ఏపీవో వసంతరావు, డీటీడీవోలు పోచం, జనార్దన్‌, ఎల్‌డీఎం, అధికారులు పాల్గొన్నారు.

సబ్బుల ఉత్పత్తి పెంచాలి

సబ్బుల తయారీని మరింత పెంచాలని ట్రైకార్‌ డీజీ ఎం శంకర్‌రావు కోరారు. శివ్వాపూర్‌లో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి వివరాలను తెలుసుకున్నారు. మొత్తంలో సబ్బులు తయారీ చేసి అగ్రస్థానంలో ఉండేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. అందులో ఎందరు పనిచేస్తున్నారో, ఇప్పటి వరకు ఉత్పత్తి చేసిన సబ్బుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూనిట్‌ లాభాల బాటలో నడిచేలా చూడాలన్నారు.logo