శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Jan 25, 2020 , 02:13:33

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ


భూపాలపల్లి టౌన్‌/మొగుళ్లపల్లి, జనవరి 24 : పలు మండలాల లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పం పిణీ చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు  మొగుళ్లపల్లి మండ లం ఇస్సీపేట, మొట్లపల్లి, పెద్దకొమటిపల్లి, వేములపల్లి గ్రామాల్లో బాధిత కుటుంబాలు సహా మొత్తం 11 మందికి రూ. 3.44 లక్షల విలువైన చెక్కులను అందించారు. మొగుళ్లపల్లి మండలం రంగాపు రం, ములుకలపల్లి, మెట్టుపల్లి గ్రామాలకు చెందిన ఇంజపల్లి రాజమల్లు, వడిజె మ హేందర్‌, ఏకాంబ నాగేశ్వర్‌రావు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను ఎమ్మె ల్యే పరామర్శించారు. అనారోగ్యంతో బా ధపడుతూ చికిత్స పొందిన బాధితులకు ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయాన్ని మంజూరు చేసిందని వివరించారు. వెంట జెడ్పీటీసీ జోరుక సద య్య, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, వైస్‌ ఎంపీపీ పోల్నేని రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌ బల్గూరి తిరుపతిరావు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన టీఆర్‌ఎస్‌ క్యాలెండర్‌ను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాం బమూర్తి, నాయకులు బుర్ర రమేశ్‌, కొత్త హరిబాబు, సెగ్గం సిద్ధు, చల్లూరి సమ్మ య్య, శిరుప అనిల్‌, జక్కం రవి, రాజలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.


logo