శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jan 24, 2020 , 04:51:38

మేడారంలో వసతులు బాగుండాలి

మేడారంలో వసతులు  బాగుండాలి
  • -జాతర అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి
  • - ప్రతి రోజూ పనులు పర్యవేక్షించాలి
  • -ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించాలి
  • - ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరకు చర్యలు తీసుకోవాలి
  • - జాతర విశిష్టతపై ప్రచారం చేపట్టాలి
  • - రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
  • - ఉన్నతాధికారులతో సమీక్ష‘మేడారంలో వసతులు బాగుండాలి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలి. జాతర అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి’ అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజన శాఖ కార్యదర్శి బెనహర్‌ మహేశ్‌దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్త్‌, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మేడారం జాతరలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, అధికారులు రోజూ పర్యవేక్షించాలని అన్నారు. గతంలో మేడారం జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులను డిప్యు టేషన్‌పై రప్పించాలని సూచించారు. జాతరపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. జాతరను బ్రాండింగ్‌ చేయాలని, సీఎం కేసీఆర్‌కు, దేశంలోని గిరిజన నేతలు, ప్రముఖులకు జాతర ఆహ్వాన పత్రికలు అందించాలని కోరారు.               - ములుగు జిల్లా ప్రతినిధి/నమసే ్తతెలంగాణ

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: మేడారంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మహాజాతర సందర్భంగా వసతులు బాగుండాలని, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర పనులపై హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజన శాఖ కార్యదర్శి బెనహర్‌ మహేష్‌దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గురువారం సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఆర్థిక మాద్యం ఉన్నా మేడారం జాతరపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టి రూ.75 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకొని భక్తులకు మంచి వసతులు కల్పించాలని సూచించారు. జాతరను బ్రాండింగ్‌ చేయాలని, సీఎం కేసీఆర్‌కు, దేశంలోని గిరిజన నేతలు, ప్రముఖులకు జాతర ఆహ్వాన పత్రికలు అందించాలని సూచించారు.

పనులను రోజూ పర్యవేక్షించాలి

మేడారం జాతరలో మిగిలిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, అధికారులు ఆ పనులను రోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. గతంలో మేడారం జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులను డిప్యూటేషన్‌పై రప్పించాలని సూచించారు. జాతరపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

‘ప్లాస్టిక్‌ ఫ్రీ మేడారం’ తప్పనిసరి

మేడారం జాతరను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించామని, జాతరకు వచ్చే భక్తులు కొబ్బరికాయలు, ఇతర వస్తు, పూజ సామగ్రికి ప్లాస్టిక్‌ కవర్లు వాడకుండా క్లాత్‌, నార సంచులు అందించాలని కోరారు. మేడారంలో షాపుల నిర్వాహకులు ప్లాస్టిక్‌ విక్రయిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో వనదేవతల ఆశీర్వాదం పొందేలా, అడవిని రక్షించి, ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేలా చూడాలన్నారు.

మెరుగైన ఫలితాలు సాధించాలి

గిరిజన గురుకులాల ఆశ్రమ పాఠశాలలో గతం కంటే ఈ సారి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్‌, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ భోజన వసతి కల్పించాలని సూచించారు. 10వ తరగతి, ఇంటర్‌ తర్వాత నిర్వహించే పోటీ పరీక్షల్లో గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అత్యధిక సీట్లు పొందేలా శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సరేశ్వర్‌రెడ్డి, గురుకులాల డిప్యూటీ కార్యదర్శి నికోలస్‌, డీజీఎం శంకర్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.logo