గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jan 24, 2020 , 04:51:38

అభివృద్ధి పనులను వేగంగా చేయాలి

 అభివృద్ధి పనులను వేగంగా చేయాలి
  • - పార్కింగ్‌ స్థలాల్లో సదుపాయాలు కల్పించాలి
  • - సూచిక బోర్డులను అమర్చాలి
  • - క్యూలైన్లలో తాగునీటి వసతి కల్పించాలి
  • -విస్తృత క్షేత్ర పర్యటనలో కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్పీ, నోడల్‌ ఆఫీసర్‌
  • -పనులు వేగవంతం చేయాలి
  • -పార్కింగ్‌ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
  • -సూచిక బోర్డులను అమర్చాలి
  • -క్యూలైన్లతో తాగునీటి వసతి కల్పించాలి
  • -భద్రత చర్యలపై దృష్టి సారించాలి
  • -విస్తృత క్షేత్ర పర్యటనలో


    అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్‌, ఎస్పీ, నోడల్‌ ఆఫీసర్‌

ములుగు, నమస్తే తెలంగాణ: మేడారం జాతరకు హాజరయ్యే భక్తుల సంఖ్యకు తగిన విధంగా ఏర్పాట్లను చేస్తూ చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టర్‌, ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, నోడల్‌ ఆఫీసర్‌ గౌతమ్‌తో కలిసి మేడారంలో విస్తృత క్షేత్ర పర్యటన చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పార్కింగ్‌ స్థలాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, క్యూలైన్లు, ఆలయ ప్రవేశం, దర్శ నం చేసుకొని బయటకు వెళ్లే దారులు, పారిశుధ్యం, షెడ్ల నిర్మాణాలు, ఆలయ పరిసరాల పెయింటింగ్‌, స్నాన ఘట్టాలు, దస్తులు మార్చుకునే కేంద్రాలు, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఏర్పాట్లు, రహదారుల నిర్మాణాల పురోగతిపై అధికారులతో కలిసి విస్తృతం గా పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జాతరకు ముందే భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని, వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, భక్తుల రాక అంచనాల ప్రకారం సౌకర్యా లు కల్పించాని చెప్పారు. ముఖ్యంగా పార్కింగ్‌ స్థలా ల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఫ్లడ్‌లైట్లు, బ్యాటరీ  ఆఫ్‌ ట్యాప్స్‌, సూచిక బోర్డుల ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలని వివరించారు.


మరుగుదొడ్ల నిర్మాణాల్లో వేగం పెంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. క్యూలైన్ల వద్ద తాగునీటి వసతిని కల్పిస్తూ భక్తులకు సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. భ క్తుల ఆలయ ప్రవేశం, నిష్క్రమణలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పో లీసులకు సూచించారు. పారిశుధ్య పనులను ముమ్మ రం చేస్తూ భక్తులకు పరిశుభ్ర వాతావరణం కల్పించాలని అన్నారు. జాతర పరిసరాల్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి డంపింగ్‌ యార్డుకు తరలించేలా విస్త్రత చర్యలు చేపట్టాలని సూచించారు. జంతు వధలు ఎక్కడ పడితే అక్కడ చేపట్టకుండా స్లాటర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షౌరశాలలో ఒకేధర నిర్ణయించి భక్తుల నుంచి ఫిర్యాదులు రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్లాస్టిక్‌ నియంత్రణను అమలు చేయాలని, ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలు జాతర ప్రాంగణంలో విస్తృతంగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనులను పూర్తిచేసి జాతరను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఇన్‌చార్జి డీఆర్వో కూతాటి రమాదేవి, ఓఎస్డీ సురేశ్‌కుమార్‌, ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్‌చంద్రపవార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


తాజావార్తలు


logo