సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 23, 2020 , 02:17:27

మెరుగైన వైద్యసేవలు అందించాలి

మెరుగైన వైద్యసేవలు అందించాలి


తాడ్వాయి, జనవరి 22 : మేడారం సమ్మక్క-సారక్కల దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ రవీందర్ అన్నారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలోని జాతర వైద్యశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతమందికి వైద్యసేవలు అందిస్తున్నారని, ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిబ్బంది అందుబాటులో ఉంటూ భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.


logo