శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jan 22, 2020 , 03:49:24

జిగేల్‌.. జిగేల్‌..

జిగేల్‌.. జిగేల్‌..
  • -విద్యుత్‌ వెలుగులతో కాంతులీనుతున్న లక్నవరం పరిసరాలు
  • -రెండు వేలాడే వంతెనలపై లైటింగ్‌
  • -టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు
  • - పర్యాటకులకు కనువిందు చేస్తున్న సరస్సు అందాలు
పర్యాటక ప్రాంతంగా విరాజిల్లు తూ దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానిస్తున్న లక్నవరం సరస్సు విద్యుత్‌ దీపాలతో జిగేల్‌ మంటున్నది. గత వారం లక్నవరం సందర్శన కు వచ్చిన టీఎస్‌టీడీసీ ఎండీ బోయినపల్లి మ నోహర్‌రావు.. సరస్సు వద్ద పర్యాటకుల మన స్సు దోచేలా, నూతన హంగులతో లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించా రు. మేడారం జాతర నాటికి లక్నవరాన్ని మరిం త ఆహ్లాదకరంగా మార్చాలని ఆదేశించారు. సరస్సులో వేలాడే వంతెనలకు టూరిజం శాఖ అధికారులు విద్యుద్దీపాలు, సీరియల్‌ బల్బులు ఏర్పాటు చేయించారు. దీంతో రాత్రి వేళల్లో సర స్సు విద్యుత్‌ వెలుగులతో జిగేల్‌ మంటున్నది.
- గోవిందరావుపేట విలేకరి

తాజావార్తలు


logo