సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 21, 2020 , 02:37:05

గులాబీ జెండా ఎగురవేస్తాం..

గులాబీ జెండా ఎగురవేస్తాం..
  • - మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం
  • - కమ్యూనిస్టులకు కాలం చెల్లింది కాంగ్రెస్‌, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదు
  • - అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ విధానం
  • ‘నమస్తే తెలంగాణ’తో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీఆర్‌ఎస్‌ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టం కట్టబోతున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సుడిగాలి ప్రచారం చేపట్టినట్లు ఆమె తెలిపారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ గత ఐదేళ్లలో మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురడం ఖాయం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, బీజేపీని అసలే విశ్వసించడం లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు కాలం చెల్లిందని. ఈ ఎన్నికలతో అవి చెల్లకుండా పోతాయని జోష్యం చెప్పారు.

నమస్తే :  ఎన్నికల్లో ఎన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తారు..?
మంత్రి : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని మున్సిపాలిటీల ఇన్‌చార్జి బాధ్యతలు నాకు అప్పగించారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ, ఇల్లందు, (మణుగూర్‌ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగడం లేదు) మున్సిపాలిటీలు ఉన్నాయి.  మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేస్తాం. ప్రజలంతా అభివృద్ధిని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను తప్పకుండా ఆశీర్వదిస్తారు.

నమస్తే : గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేశారు..?
మంత్రి : గతంలో ఉన్న మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులు కేటాయించింది. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేసింది. అన్ని మన్సిపాలిటీల్లో సెంట్రల్‌ లైటింగ్‌, సీసీ రోడ్లు, మురుగు కాల్వలనిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధే ప్రతిపక్షాలకు సమాధానం చెబుతుంది. మహబూబాబాద్‌ మున్సిపాలిటీల్లో ఇప్పటికే వందల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన డోర్నకల్‌, మరిపెడ, ఇల్లందు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.

నమస్తే : ప్రచార సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది?
మంత్రి : గతంలో డివిజన్‌ కేంద్రంగా ఉన్న మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాం. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఏరియా ఆస్పత్రికి రూ.60కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే 200 పడకల ఆస్పత్రిని నిర్మించుకోనున్నాం. మెడికల్‌ కళాశాల కూడా మంజూరు చేయిస్తానని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అంతేకాకుండా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇదంతా ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ప్రచార సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి స్వచ్ఛందంగా వచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు పలికారు.

నమస్తే: ప్రతిపక్షాల విమర్శలపై మీ కామెంట్‌..?
మంత్రి : కమ్యూనిస్టు పార్టీలకు కాలం చెల్లింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు. ఇక బీజేపీని ప్రజలు నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రభుత్వంపై ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మేస్థితిలో లేరు. అభివృద్ధికి పట్టం కడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీని, ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో ఫిక్స్‌ అయ్యారు. నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుస్తారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.

నమస్తే : రాబోయే రోజుల్లో మున్సిపాలిటీల అభివృద్ధికి ఏం చేయబోతున్నారు..?
మంత్రి : ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఇదే తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. పట్టణాలన్నీ అద్దలాం మెరిసేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుంది. పట్టణాల్లో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ స్థలంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించబోతున్నాం. అదేవిధంగా పట్టణాల్లో 75 గజాల ఇంటి స్థ లంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి ని ర్మాణం చేసుకునేలా ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చ ట్టా న్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా పట్టణ ప్రజల కు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా పట్టణాల అ భివృద్ధికి వందల కోట్ల నిధులు విడుదల కానున్నాయి.

నమస్తే : మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థు చర్యలుంటాయా..?
మంత్రి : పార్టీ ప్రకటించిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండాలని, పార్టీకి చెందిన మరెవరైనా అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకోవాలని సూచించాం. అయినా, కొన్ని వార్డుల్లో కొందరు అభ్యర్థులు నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. అలాంటి వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఒకసారి అవకాశం రానంత మాత్రన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ భీం ఫాం ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేసి గెలిపించాలి.

నమస్తే : ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు?
మంత్రి : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా అభివృద్ధే నినాదంతో ముందుకు సాగాం. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో గెలిచితీరుతాం. నాతో పాటు ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌, హరిప్రియనాయక్‌ స్థానికంగా ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీల నా యకులు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వ స్తారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధు లు, నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పాల్గొన్నాం.logo