సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 19, 2020 , 01:45:27

రెండు చుక్కలతో నిండైన జీవితం

రెండు చుక్కలతో నిండైన జీవితం

ములుగు, నమస్తే తెలంగాణ : చిన్నారుల ఆరో గ్య రక్షణతోపాటు పోలియో రహిత సమాజ నిర్మాణానికి పిల్లలకు రెండు చుక్కలు వేయడానికి ము లుగు జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించనున్న ప ల్స్‌ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుంది. 0-5 యేళ్ల లోపు వయస్సు గల పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాలో అ న్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని బస్టాండ్లు, ప్రధాన కూడళ్లతోపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యశాలల్లో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే విస్త్రత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. “పోలియే చుక్కలు వేయి ద్దాం..పోలియో మహమ్మారిని నిర్మూలిద్దాం” అనే నినాదాలతో జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో నేడు నిర్వహిం చే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది సమాయత్తమయ్యారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అల్లెం అప్పయ్య నేతృత్వంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

 

ప్రత్యేక కార్యాచరణ..

ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పోలియో నిర్మూలనపై అ వగాహన ర్యాలీ నిర్వహించి నేడు చేపట్టే పల్స్‌ పో లియో కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజలకు తెలిపారు. నేటి నుంచి 21వ తేదీ వరకు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. 0-5 యేళ్ల లోపు పిల్లలందరికీ 2పోలియో చుక్కలను వేయడానికి ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో అర్హత ఉన్న 20వేల139 పిల్లలను గుర్తించారు. వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 27రూట్లుగా విభజించి 13 మొబైల్‌ టీంలను రూపొందించా రు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 316పోలియో చు క్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు పోలి యో చుక్కల కేంద్రాల వద్దకు స్వయంగా తమ పి ల్లలను తీసుకువచ్చి చుక్కలు వేయించాలని విస్త్ర త ప్రచారం నిర్వహించారు. నేడు కేంద్రాలకు హా జరుకాకుండా ఉన్న పిల్లలకు ఈ నెల 20, 21వ తేదీలలో మొబైల్‌ టీంల ద్వారా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఇంటింటికీ తిరుగుతూ పోలి యో చుక్కలు వేయనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో, ఇటుక బట్టీల దగ్గర, రోడ్డు నిర్మాణ పనులు, సంచార జాతుల వారి పిల్లలను గుర్తించి మొబైల్‌ టీమ్‌లను చుక్కలు వేయనున్నారు.

పల్స్‌పోలియోను విజయవంతం చేయాలి

- డీఎంహెచ్‌వో అప్పయ్య

జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించనున్న జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోలియో అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ 0-5 యేళ్ల లోపు పిల్లలందరికీ  పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. నేడు ఉదయం 7గంటలకు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఈ పల్స్‌పొలియో కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా హాజరై ప్రారంభించేట్లు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పోరిక రవీందర్‌, వైద్య సిబ్బంది నవీన్‌రాజ్‌కుమార్‌, ప్రతాప్‌, దుర్గారావు, ఆరోగ్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.logo