బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Jan 18, 2020 , 04:07:45

సమన్వయంతో ముంప్దకు పాగాలి

సమన్వయంతో ముంప్దకు పాగాలి
  • -జాతరలో విధులు నిర్వర్తించడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి
  • - అంకితభావంతో పనిచేసి జయప్రదం చేయాలి
  • - భక్తులకు అర్థమయ్యేలా సూచిక బోర్డులు పెట్టాలి
  • -ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలి
  • -జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు
  • - గతంలో కంటే మెరుగైన సేవలందించాలి
  • - సెక్టోరల్‌ అధికారులదే కీలకపాత్ర
  • - జాతర నోడల్‌ అధికారి వీపీ గౌతమ్‌

‘భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగనీయొద్దు. అధికారులు అంకితభావంతో పనిచేయాలి. సమన్వయంతో ముందుకు సాగాలి. మేడారంలో విధులు నిర్వర్తించడం పూర్వ జన్మ సుకృతంగా భావించాలి. మెరుగైన సేవలందించి జాతరను విజయవంతం చేయాలి’ అని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో జాతర సెక్టోరల్‌ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతరకు కోటి మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. భక్తులకు అర్థమయ్యేలా రోడ్లు, భవనాల శాఖ వారు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. వైద్యసిబ్బంది మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జంపన్న వాగు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. నోడల్‌ అధికారి వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ జాతర నిర్వహణలో సెక్టోరల్‌ అధికారులదే కీలకపాత్ర అని అన్నారు. గత జాతరల కంటే మెరుగైన సేవలందించాలని సూచించారు.  

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: మేడారం మ హాజాతరలో అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. మే డారం జాతరలో విధులు నిర్వహించనున్న సెక్టోరల్‌ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మొదటి విడత శిక్షణ ఇచ్చారు. ఇందులో కలెక్టర్‌ మాట్లాడుతూ జాతర విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా వర్గాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జాతరకు వస్తు న్న భక్తుల సంఖ్యను చూస్తే మేడారానికి జాతీయ హోదా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జాతరలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావించాలని, జాతర ముం దు, తర్వాత జంపన్నవాగు వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలని, ఏమరపాటు తగదని అధికారులను హెచ్చరించారు. జాతర పరిసరాల్లో భక్తులకు అర్థమయ్యేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

పలు జాతర్లకు నిధులు

మేడారం జాతర సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ని ర్వహించే పిల్ల జాతరలకు రూ. 1కోటీ 70 లక్షలతో సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మేడారం జాతర ప్రత్యే క యాప్‌ను రూపొందించినట్లు వివరించారు. తమ తమ శాఖల వివరాలు పూర్తిస్థాయిలో పొందుపర్చాలని అధికారులకు సూచించారు.

ఆలయాన్ని అలంకరించాలి

మేడారం జాతరకు సమయం సమీపిస్తున్నదని, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. పరిసరాల్లో లైటింగ్‌ ఏర్పాటు చేయాలని, గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పెయింటింగ్‌ ఉండాలన్నారు. శాఖల వారీగా సెక్టార్లను విభజించి సిబ్బందికి షిప్ట్‌ల వారీగా విధులు అప్పగించాలని ఆదేశించారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, జాతర సమయంలో అధికారులు 24 గంటల పాటు పారిశుధ్య పనులు చేపట్టాలని, జాతర చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బందికి యూనిఫాం, గ్లౌజ్‌లు, మాస్క్‌లు అందిచాలని కో రారు. వైద్య ఆరోగ్యశాఖ మందులు అందుబాటులో ఉంచుకొని మెరుగైన సేవలందించాలని, ఇంజినీరింగ్‌ విభాగం, పారిశుధ్య విభాగం సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.

జాతరను చాలెంజ్‌గా తీసుకోవాలి

జాతరను అధికారులు చాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేయాలని జాతర నోడల్‌ అధికారి, భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌ సూచించారు. రెండేళ్లకోసారి వచ్చే జాతరలో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని, గతం కంటే మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జాతరలో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమని, వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీరు, మరుగుదొడ్లు, కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెక్టార్‌ మ్యాప్‌, డైరీ వెంట ఉండాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. భక్తులు బయల్దేరే సమయంలో ప్లాస్టిక్‌ నిషేధం గుర్తుకు రావాలని, వచ్చే భక్తులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులు వెంట తెచ్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, భూపాలపల్లి ఆర్డీవో వైవీ గణేశ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ జేడీ డీఎస్‌ జగన్‌, డీడీ ఎండీ ముర్తూజ, జెడ్పీసీఈవో పారిజాతం, మేడారం ఈవో రాజేంద్రం, కలెక్టర్‌ ఏవో శ్యాంకుమార్‌, వివిధ శాఖల సెక్టోరల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ నిషేధం తప్పనిసరి

మేడారం జాతరలో తప్పనిసరిగా ప్లాస్టిక్‌ నిషేధించాలని కలెక్టర్‌ సూచించారు. ప్లాస్టిక్‌ స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులు, పేపర్‌, క్లాత్‌, జూట్‌ బ్యాగులను వాడాలని సూచించారు. ఈ సందేశం ప్రతి ఇంటికీ చేరేలా, భక్తులకు అర్థమ య్యే రీతిలో ప్రచారం చేయాలని చెప్పారు. జాతరకు వచ్చే దారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, జాతర ప్రాంగణంలో ప్రత్యామ్నాయ వస్తువుల స్టాల్‌ ఏర్పాటు చేయాలని ఆ దేశించారు. గద్దెల వద్ద విధులు నిర్వహించే అధికారులు ఓర్పు, సహనంతో సేవలందించాలని ఆదేశించారు. అధికారులకు, పాత్రికేయులకు ప్రత్యేక దర్శనానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.logo