మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 18, 2020 , 04:04:40

ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యం

ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యం
  • - ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సేవ చేసే అవకాశం
  • -శిక్షణలో అన్ని అంశాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి
  • -ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌
  • - వరంగల్‌లోని మామునూరు బెటాలియన్‌లో నూతనంగా ఎంపికైన 300 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ

ములుగు, నమస్తే తెలంగాణ : పోలీస్‌ ఉద్యోగ నిర్వహణలో క్రమ శిక్షణ ఎంతో ముఖ్యమని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని మామునూరు ఫోర్త్‌ బెటాలియన్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో నూతనంగా పోలీస్‌శాఖకు ఎంపికైన 300మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నిర్వహించిన బేసిక్‌ ఇండక్షన్‌  శిక్షణ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పోలీస్‌శాఖ అన్ని విభాగాలు, అన్ని స్థాయిలలో ఆధునిక మార్పులతో ముందుకు సాగుతుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిలలో ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అందుకు అనుగుణంగా శిక్షణలోని అన్ని అంశాలపై క్షుణ్ణంగా అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. పోలీస్‌ ఉద్యోగం అత్యుత్తమమైనదని, ప్రజలకు సన్నిహితంగా ఉంటూ సేవ చేసే అవకాశం కేవలం పోలీస్‌ ఉద్యోగం ద్వారానే లభిస్తుందని అన్నారు. ఇండోర్‌, ఔట్‌ డోర్‌ శిక్షణలో నేర్పే అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని అన్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా తయారవ్వాలని, అప్పుడే 9నెలల శిక్షణను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారని ఎస్పీ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo