శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jan 17, 2020 , 02:31:14

కమనీయం..గోదా కల్యాణం

కమనీయం..గోదా కల్యాణం


భూపాలపల్లి టౌన్, జనవరి 16 : భూపాలపల్లిలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో గోదాదేవి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. క్యాంపు కార్యాలయ ఆవరణలో గోదాదేవి కల్యాణ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవానికి అనంతశ్రీ విభూషిత శ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ హాజరై మహోత్సవాన్ని కొనసాగించారు. వేడుకలకు నియోజకవర్గం నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. గండ్ర దంపతులు, వారి కుమారులు గౌతమ్ గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు మహోత్సవం కొనసాగింది. జీయర్ ఎమ్మెల్యే రమణారెడ్డి, ఆయన సతీమణి రూరల్ జెడ్పీ చైర్ గండ్ర జ్యోతి ఘనంగా స్వాగతం పలికారు. గోదాదేవి కల్యాణ మహోత్సవానికి హాజరైన వారందరికీ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. హాజరైన వారికి ప్రత్యేక ప్రసాదం అందజేశారు.

కొడవటంచలో..

రేగొండ, జనవరి 16 : కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణాన్ని బుధవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజల పాటు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించారు. బుధవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లకీ సేవపై ఆలయ విధుల్లో ఊరేగించారు. రాత్రి గోదాదేవి కల్యాణ వేడుకలను ఆలయ ప్రధాన అర్చకులు తూపురాణి బుచ్చమాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు కల్యాణం జరిపించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ హింగె మహేందర్, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్ గ్రామస్తులు, మాదాటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


తాజావార్తలు


logo