సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 15, 2020 , 02:49:05

మేడారం ట్రస్టు బోర్డు డైరెక్టర్లకు సన్మానం

మేడారం ట్రస్టు బోర్డు డైరెక్టర్లకు సన్మానం


ఏటూరునాగారం, జనవరి 13: మేడారం ట్రస్టుబోర్డు డైరెక్టర్లుగా ఎన్నికైన పలువురిని మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు సన్మానించారు. ఇటీవల ప్రభుత్వం మేడారం ట్రస్టుబోర్డు పునరుద్ధరణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కాగా, డైరెక్టర్లను నర్సింహారావు తన ఇంట్లో సన్మానించారు. డైరెక్టర్లు మడప శ్యాంసుందర్‌, బద్ది రాజు రవిచంద్ర, పెండ్యాల ప్రభాకర్‌, పొడెం శోభన్‌, చిలకమర్రి రాజేందర్‌, వట్టం నాగరాజు, వాసం రజని, భాగ్యలక్ష్మీ తదితరులు హాజరు కాగా, వారికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. డైరెక్టర్లకు తల్లుల సన్నిధిలో సేవ చేసే భాగ్యం దక్కిందని, అందరూ భక్తులకు సేవలందించాలని కోరారు. జాతరను విజయవంతం చేయాలని, తల్లుల ఆశీస్సులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు పర్వతాల భరత్‌, జాడి లక్ష్మీనారాయణ, కోట నర్సింహులు, మండల కోఆప్షన్‌ ఖలీల్‌, గోవిందరావుపేట జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, మాజీ సర్పంచ్‌ కాకులమర్రి చక్రధర్‌రావు, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు హబీబ్‌ఖాన్‌, నూతి కృష్ణమూర్తి, కాకులమర్రి ప్రదీప్‌, వలీబాబా, బాస పుల్లయ్య, బట్టు కొమురయ్య, మెరుగు వెంకటేశ్వర్లు, కుమ్మరి చంద్రబాబు, శివాలయం కమిటీ చైర్మన్‌ తాడూరి రఘు, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్‌ చెన్నముత్తయ్య, కాత యాదగిరి, ఎజాజ్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఆకుల సాంబయ్య, ఉప సర్పంచ్‌ కర్ల అరుణ, లక్ష్మీపురం సర్పంచ్‌ కొట్టె ఉమామహేశ్వరి, దడిగల లక్ష్మణ్‌, బిర్యాని రమేశ్‌, వార్డు సభ్యులు అశ్విని, సుజాత తదితరులు పాల్గొన్నారు.


logo