శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Jan 15, 2020 , 02:47:13

నేడు లక్ష్మీనరసింహస్వామి వరపూజా మహోత్సవం

నేడు లక్ష్మీనరసింహస్వామి వరపూజా మహోత్సవం
  • - ఏర్పాట్లు చేసిన దేవస్థాన సిబ్బందిమంగపేట, జనవరి 14: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధికెక్కిన మంగపేట మండలం మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి వరపూజ (కల్యాణ నిశ్చితార్థ వేడుక) నేడు (బుధవారం) మల్లూరులోని మండపం వద్ద వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ఆదిలక్ష్మి-చెంచులక్ష్మి అమ్మవార్లతో వరపూజ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సతీ సమేతంగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు గుట్టపైన ఉన్న చింతామణి జలధార వద్ద అభిషేకాలు చేసి నూతన పట్టు వస్ర్తాలతో అలంకరిస్తారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం వేళ సతీ సమేత స్వామి వారిని పల్లకీలో ఆసీనులను చేసి, సన్నాయి మేళ వా యిద్యాల మధ్య ఊరేగింపుగా మల్లూరులోని మం డపం వద్దకు తీసుకొస్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తజనం మధ్య రాత్రి 12:30 గంటలకు దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో వరపూజ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా జరిపిస్తారు. భక్తులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ ఈవో శ్రావణపు సత్యనారాయణ, ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు పిలుపునిచ్చారు. మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించి, స్వామి వారి కల్యాణం జరిపిస్తామని తెలిపారు.
logo