మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jan 15, 2020 , 02:44:41

మేడారంలో భక్తుల సందడి

మేడారంలో భక్తుల సందడి


తాడ్వాయి, జనవరి 14 : వరాలిచ్చే దేవతలు, ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భోగి పండుగ సందదర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తల్లుల దర్శనానికి తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తల్లులకు తలనీలాలను సమర్పించి, అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్నారు.  అక్కడ సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతులలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం యాటపోతులను సమర్పించి గద్దెల పరిసరాలతోపాటు చిలుకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో విడిది చేశారు. వంటలు చేసుకుని విందు భోజనాలు చేశారు.


logo