మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 14, 2020 , 03:17:08

తల్లులకు నీరా‘జనం’

తల్లులకు నీరా‘జనం’


- మేడారానికి ముందస్తుగా తరలివస్తున్న భక్తులు

తాడ్వాయి, జనవరి 13: వనదేవతలు మేడారం సమ్మక్క-సారక్క ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. అమ్మవార్ల మహాజాతర ఫిబ్రవరిలో జరగనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకుని ముందస్తుగా మొక్కులు చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పా టు పలు రాష్ర్టాల నుంచి భక్తులు సోమవారం పెద్ద సంఖ్యలో వచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేశారు. కల్యాణకట్టలో పుట్టు వెంట్రుకలు ఇచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం (బెల్లం), నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు, సారె సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేశారు. తల్లులకు యాటపోతులు బలిచ్చారు. గద్దెల పరిసరాలతో పాటు చిలుకలగుట్ట, శివరాంసాగర్‌ చె రువు, జంపన్నవాగు దారిలోని చెట్ల కింద వంటలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో జాతర పరిసరాలు కోలాహలంగా మారుతున్నాయి. కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. logo