శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jan 14, 2020 , 03:16:28

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి
  • - ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు


ఏటూరునాగారం, జనవరి 13: ఆదివాసీలు, అధికారులు సమన్వయంతో పని చేసి మేడారం జాతరను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు. ఆదివాసీ సంఘాలతో ఐటీడీఏ కార్యాలయంలో పీవోతో పాటు ఏటూరునాగారం, ములుగు ఏఎస్పీలు శరత్‌చంద్ర పవార్‌, సాయి చై తన్య సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జాత ర నిర్వహణలో తలెత్తే ఇబ్బందులు, లోపాలు, జాతర విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలు, షాపుల కేటాయింపుపై అభిప్రాయాలు సేకరించారు. ఆదివాసీ సంఘాలు, విద్యార్థి సంఘా ల నాయకులు వట్టం ఉపేందర్‌, కబ్బాక శ్రావణ్‌కుమార్‌, మం కిడి బుచ్చయ్య, చందా రఘుపతిరావు, పొడెం రత్నం, పొడెం బా బు, అర్రెం లచ్చు పటేల్‌, కొప్పుల రవి, కూన శివరాం, బాలకృష్ణ, మడె సాయిబాబాతో పాటు పలువురు మాట్లాడారు.  సమ్మక్క-సారలమ్మను గద్దెలపైకి తీసుకువచ్చే క్రమంలో గిరిజన బెటాలియన్‌ను నియమించాలని, మద్యం, బెల్లం, కొబ్బరిషాపులు కేటాయించిన తర్వాత వాటికి అవసరమైన స్థలం ఇవ్వాలన్నారు. దేవాదాయ శాఖ కార్యాలయం పక్కన ఆదివాసీ వలంటీర్లు ఉండేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులు ఆయా గ్రామాల నుంచి బయల్దేరే సమయంలో పోలీసుల రక్షణ కల్పించాలని, మేడారంలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదివాసీ ప్రముఖులు విడిది చేసేందుకు పది ఎకరాల స్థలం కేటాయించి, భవనం నిర్మించాలని కోరారు. పీవో చక్రధర్‌రావు మాట్లాడుతూ భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ సంఘాలు, అధికారులపై ఉందన్నారు. మేడారంలో లక్ష్మీ దేవరకు స్థలం కేటాయిస్తామని తెలిపారు. టీ షర్టులు, క్యాప్‌లు అందిస్తామని పేర్కొన్నారు. 20వ తేదీ నుంచి కొబ్బరి, బెల్లం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఎక్సైజ్‌ అధికారులతో మాట్లాడి ఈవెంట్‌ లైసెన్సు తీ సుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. 22 మద్యం షాపులు ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నట్లు పీవో పేర్కొన్నారు. ఫుడ్‌ కోర్టు, ట్రైబల్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే శుక్రవారం మేడారంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పీవో తెలిపారు. 40 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే విధం గా వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. ఏఎస్పీలు శరత్‌ చంద్ర పవార్‌, సాయి చైతన్య మాట్లాడుతూ అవసరమైన మేరకు పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సంఘాలకు చెందిన సుమారు 200 మంది పాల్గొన్నారు.
logo