గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jan 14, 2020 , 03:15:34

క్రీడలతో స్నేహభావం పెంపు

క్రీడలతో స్నేహభావం పెంపు
  • - జెడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు
  • - క్రీడాపోటీల విజేతలకు బహుమతుల అందజేత

మహాముత్తారం, జనవరి 13: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, స్నేహభావం పెంపొందిస్తాయని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి పేర్కొన్నారు. నర్సింగాపూర్‌ హనుమాన్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ, వాలీబాల్‌ పోటీల విజేతలకు సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో ప్రథమ స్థానం సాధించిన మహబుబ్‌పల్లి, ద్వితీయ స్థానం సాధించిన మహాముత్తారం జట్లకు, వాలీబాల్‌లో మొదటి స్థానం సాధించిన దమ్మూరు, ద్వితీయ స్థానం సాధించిన కాలువపల్లి జట్లకు వారు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లకు రూ. 50,016, ద్వితీయ బహుమతి పొందిన జట్లకు రూ. 25,016 అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌, చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను పోత్సహించేందుకు ఇలాంటి క్రీడలు దోహద పడతాయన్నారు. మారుమూల ప్రాంతంలో జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. కాగా, మహాముత్తారం ఎస్సై తమను మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడని కొర్లకుంట గ్రామానికి చెందిన సర్వ అంజిబాబు, యామన్‌పల్లి గ్రామానికి చెందిన పిలుమరి మల్లయ్య పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్కిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి,  జెడ్పీటీసీ లింగమల్ల శారద, మహదేవపూర్‌ ఎంపీపీ రాణీబాయి, కాటారం మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అంకారి భవాణి, వైస్‌ చైర్మన్‌ రాధారపు స్వామి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మార్క రాము గౌడ్‌, ఎంపీటీసీలు లక్కిరెడ్డి నర్సింహరెడ్డి, శ్రీపతి సురేశ్‌, నాయకులు జక్కు రాకేశ్‌, నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మందల రాజిరెడ్డి, కొర్లకుంట సర్పంచ్‌ ననీవ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత

కాటారం : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత చేకూరుతుందని భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రా కేశ్‌, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో దీక్షాపరులు, భక్తులకు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు డోలి అర్జయ్య, మద్దులపల్లి సర్పంచ్‌ డోలి రామక్క సోమవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలో వారు పూజలు చేశారు. భక్తులతో కలిసి భోజనం చేశారు. అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళ్లాలన్నారు. జెడ్పీ చైర్మన్లు, అర్జయ్యను ఆలయ కమిటీ ప్రతినిధులు బచ్చు అశోక్‌, ప్రకాశ్‌ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నేత జక్కు రాకేశ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు పంతకాని సడవలి, సిరాజ్‌, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు మందల లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, మహిళాధ్యక్షురాలు రత్న సౌజన్య, ప్రధాన కార్యదర్శి జోడు శ్రీనివాస్‌, సరోజన, శాంతకుమార్‌, దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు.
logo