బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jan 13, 2020 , 03:41:26

పల్లె ప్రగతిని విజయవంతం చేయడం అభినందనీయం

పల్లె ప్రగతిని విజయవంతం చేయడం అభినందనీయం

2వ విడత పల్లె ప్ర గతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందంగా ఉందని డీపీవో వెంకయ్య అన్నారు.

గోవిందరావుపేట, జనవరి12: 2వ విడత పల్లె ప్ర గతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందంగా ఉందని డీపీవో వెంకయ్య అన్నారు. మంగళవారం మండలంలోని దుంపిల్లగూడెం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి ముగింపు సమావేశానికి వాణి అధ్యక్షత వహించగా డీపీవోతో పాటు జెడ్పీఫ్లోర్‌లీడర్‌ తు మ్మల హరిబాబు, ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు భాగస్వాములై గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అనంతరం హరిబాబు, శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో చేపట్టిన శ్రమదాన కార్యక్రమం ఇంతటితోనే ఆపకుండా నిరంతరంగా కొనసాగించాలన్నారు. అనంతరం గ్రామస్తులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సూదిరెడ్డి స్వప్న, ఉప సర్పంచ్‌ కట్ల నర్సిరెడ్డి, కార్యదర్శి అంజన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


లక్ష్మీపురంలో ట్రాక్టర్‌ ప్రారంభించిన డీపీవో 

మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో జీపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను  సర్పంచ్‌ లావుడ్య స్వాతితో పాటు డీపీవో వెంకయ్య, జెడ్పీఫ్లోర్‌లీడర్‌ తుమ్మల హరిబాబు, ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న తడి, పొడి చెత్తను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు పాలక వర్గం నూతన ట్రాక్టర్‌ను కొనుగోలు చేయడం సంతోషకరమన్నారు. ఈ  అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ధారవత్‌ పూర్ణ, ఏపీఎం నాగేశ్వర్‌రావు, కార్యదర్శి సారయ్య, ఉప సర్పంచ్‌ వెంకట్‌తో పాటు వార్డు సభ్యులు, ఆశావర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo