మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 12, 2020 , 04:23:39

పల్లెప్రగతిలో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి

పల్లెప్రగతిలో స్వచ్ఛ  గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి
  • -జెడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌

తాడ్వాయి, జనవరి 11: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను స్వచ్ఛత గా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ చైర్మన్‌ కుసుమ జ గదీశ్వర్‌ అన్నారు. మండలకేంద్రంలో శనివా రం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌  నాగాజ్యోతి, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రా మ్ముర్తి, ఎంపీపి గొంది వాణిశ్రీతో కలిసి జెడ్పీ చైర్మన్‌ శ్రమదానం నిర్వహించారు. ఎంపిడీవో కార్యాలయంలోని చెత్తను తొలిగించారు. అ నంతరం కార్యాలయ ఆవరణలో అధికారు లు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నా టారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో  ఇంకుడుగుంతలు నిర్మిచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డుల పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. నర్సరీల్లో విరివిగా మొ క్కలను పెంచి గ్రామాల్లో నాటేలా చర్యలు తీ సుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో చెత్తను బు ట్టల్లోనే వేసేలా చర్యలు తీసుకోవాలని, అందరి సహకారంతో స్వచ్ఛ గ్రామాలుగా మారుతాయన్నారు. ఈకార్యక్రమంలో డీపీవో వెంక య్య, జెడ్పీసీఈవో పారిజాతం, సర్పంచ్‌ ఇర్ప సునీల్‌, ఉప సర్పంచ్‌ ఇంద్రారెడ్డి, ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్‌ తదితరులున్నారు. అ లాగే మండలంలోని కాల్వపల్లిలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ నాగజ్యోతి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. చెత్తను చెత్తబుట్టల్లోనే వేయాలన్నారు.


logo