గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jan 12, 2020 , 04:20:45

సంకల్పం నెరవేరాలి

సంకల్పం నెరవేరాలి


మహాముత్తారం/ మహదేవపూర్‌, జనవరి 11: పల్లెలను బాగుచేయాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరాలని, గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధించేలా ప్రతి ఒక్కరూ పల్లెప్రగతి కార్య క్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మహాముత్తారం మండలం కొర్లకుం ట, మాదారం,  కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో శనివారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పనులను పరిశీలించారు. కొర్లకుంట, మాదారం గ్రామాల్లో ర్యాలీ తీశారు. ఆయా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంత, మరుగుదొడ్డి ఏర్పాటు చేసు కోవాలన్నారు. కొర్లకుంట, మాదారం గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు. మాదా రంలో రైతులు భూముల పట్టాల సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ మొక్కలు నాటారు. ట్రీగార్డ్స్‌ ఏర్పాటు చేశారు. ఇంకు డుగుంతల పనులను ప్రారంభించారు. కొర్లకుంట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల చదువు తీరును పరిశీలించి, చిన్నారులతో కలిసి పతంగులు ఎగరేశారు. మాదారంలో అంగన్‌వాడీ సెంటర్‌ చిన్నారులతో ముచ్చటించారు. కొర్లకుంటలో జీపీ ట్రాక్టర్‌ను నడిపారు. గ్రామస్తులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మాదారంలో నల్లా నీరు వస్తున్న తీరును పరిశీలించారు. చేతిపంపులను చూశారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  అలాగే కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. వీధుల్లో కలియతిరిగారు. పనులను తనిఖీ చేశారు. ఎస్సీ కాలనీని సందర్శించి కాలనీవాసులతో మాట్లాడా రు. పల్లెప్రగతి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచు కోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మహాముత్తారం ఎంపీపీ రత్నం సుభద్ర, జెడ్పీటీసీ లింగమల్ల శారద, మండల ప్రత్యేకాధికారి బాలకృష్ణ, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, సర్పంచులు ముక్కెర నవీన్‌గౌడ్‌, అజీమా అల్లావుద్దీన్‌, కాటారం ఎంపీడీవో శంకర్‌, ఏపీవో మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్‌ దబ్బెట సరోజన పాల్గొన్నారు.

పల్లెప్రగతిని పరిశీలించిన జెడ్పీసీఈవో

కాటారం మండలం ధన్వాడలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను జెడ్పీసీఈవో శిరీష పరిశీలించారు. ఇంటింటికీ ఇంకుడుగుంతలు తవ్వించాలని సర్పంచ్‌, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను ఆదేశించారు. డంపింగ్‌యార్డు, నర్సరీల వద్ద మట్టి పోసి ఆ ప్రాంతాన్ని చదును చేయించాలని సూచించారు. కాటారం మండల కేంద్రంలో నర్సరీలో జరుగుతున్న పనులను తనిఖీచేశారు. కొత్తపల్లి, మద్దులపల్లి, ఇబ్రహీంపల్లి, చింతకానిలో పారిశుధ్య పనులను పరిశీలించారు. వెంట సర్పంచులు రెడ్డి పోశయ్య, ఫిరోజ్‌ఖాన్‌, చల్ల రాజవ్వ, సరోజన ఉన్నారు.


logo