సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jan 12, 2020 , 04:19:15

ములుగులో సంత..జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన మసీదు గల్లీలో

ములుగులో సంత..జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన మసీదు గల్లీలో
  • -బండారి నిర్మలహరినాథం, సర్పంచ్‌ ములుగు


ఇష్టారాజ్యంగా వెలసిన చికెన్‌, మటన్‌ షాపులను గత 5 నెలల క్రితం అప్పటి కలెక్టర్‌ చింతకుంట నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వాటిని అంగడి మైదానంలో నిర్మించిన దుకాణాలకు తరలించారు. ఒకే చోట చికెన్‌, మటన్‌, చేపల వ్యాపారం నడుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకుండా ఒకే చోట ఉన్న ఈ దుకాణాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. లక్కీ డ్రా ద్వారా తీసిన ఈ దుకాణాలను అధికారులు వ్యాపారులకు అందించారు. పరిశుభ్ర వాతావరణంలో చేపడుతున్న ఈ వ్యాపారం ప్రస్తుతం జోరుగా నడుస్తోంది.

త్వరలో తరలనున్న కూరగాయల మార్కెట్‌ ..

 జాతీయ రహదారికి ఆనుకుని గాంధీజీ విగ్రహం వద్ద ఉన్న కూరగాయాల మార్కెట్‌ను కూడా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నేడు ప్రారంభమయ్యే అంగడి మైదానానికి త్వరలో తరలించనున్నారు. ఇప్పటికే షెడ్ల నిర్మాణ పనులను 90 శాతం పూర్తి చేయగా మిగతా 10 శాతం పనులను త్వరిగతిన పూర్తి చేయనున్నారు. ఈ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే కూరగాయల మార్కెట్‌ను అంగడి మైదానానికి తరలించనున్నారు.

సంతతో పెరగనున్న వ్యాపారం..

 జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న సంతతో ములుగులో వ్యాపారం అధికంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ సంత ద్వారా ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు దొరకనున్నాయి.  ప్రతి బుధ, గురు వారాల్లో జంగాలపల్లి, మల్లంపల్లి సంతలకు వెళ్లే ప్రజలు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే సంతలో తమ అవసరాలను తీర్చుకోనున్నారు. కాగా, సంత ఏర్పాటుపై  ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 నేడు ప్రారంభం ..

 జిల్లా కేంద్రంలోని గొల్లవాడలోని అంగడి మైదానంలో ఏర్పాటు చేసిన సంతను ప్రారంభించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సంతను జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్‌, జెడ్పీటీసీ సకినాల భవాని ప్రారంభించనున్నారు. 

మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం

-శ్రీదేవిసుధీర్‌యాదవ్‌, ఎంపీపీ ములుగు
ములుగులో ఏర్పాటు చేయనున్న సంతలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం. జిల్లా ఏర్పడిన తర్వాత అంగడి మైదానంలో సంత ఏర్పాటు చేయడం అభినందనీయం.  ప్రజలు కూడా వారాంతపు సంతను వినియోగించుకుని ప్లాస్టిక్‌ రహిత సంతగా మార్చాలి. 

సంతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి


 జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సంతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం అంగడి మైదానం ప్రాంతంలో మాంసం దుకాణాలను కొనసాగుతున్నాయి.  త్వరలో కూరగాయాల దుకాణాలను కూడా తరలించనున్నాం. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు అంగడి మైదానంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.


logo