బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jan 09, 2020 , 19:08:28

మేడారంలో భక్తుల సందడి

మేడారంలో భక్తుల సందడి

తాడ్వాయి, జనవరి 8: ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్క ను దర్శించుకునేందుకు బుధవారం భక్తు లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సారక్క గద్దెపై కొలువుదీరే రోజు కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు ప్రైవేటు వాహనాలలో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని, సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లులకు యాటపోతులను బలిచ్చి, గద్దెల పరిసరాలతో పాటు చిలకలగుట్ట తదితర ప్రాంతాల్లో వంటలు చేసుకుని భోజనాలు చేశారు. సమ్మక్క-సారక్క షాప్‌ మాజీ డైరెక్టర్‌ రాజనాల శ్రీహరి కుటుంబ సమేతంగా తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


logo