గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jan 09, 2020 , 19:07:58

సంతను వినియోగించుకోవాలి

సంతను వినియోగించుకోవాలి

రేగొండ, జనవరి 8 : కొడవటంచలో నూతనంగా ఏర్పాటు చేసిన సంతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆ గ్రామంలో ఏర్పా టు చేసిన నూతన సంత (అంగడి)ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉన్నందున కొడవటంచకు జనం ఎక్కువ సంఖ్య లో వస్తారని, సంతతో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వ స్తా యని చెప్పారు. రైతులు పశువులు క్రయ విక్రయాలు జరిపేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ప్రతి బుధవారం జరిగే సంతను సద్వి నియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ్‌ పబ్బ శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీటీసీ సాయిని విజయ ము త్యంరావు, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌ గౌడ్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్‌రావు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్‌ హింగె మహేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
టేకుమట్ల: వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేం ద్రా న్ని ఎమ్మెల్యే గండ్ర బుధవారం ఆకస్మికంగా తని ఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది విధులకు సకాలంలో హాజరై రోగులకు వైద్య సేవ లు అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉండే లా చూడాలన్నారు. వెంకట్రావుపల్లి మాజీ స ర్పంచ్‌ ఏకు మల్లేశ్‌ ఇటీవల మృతి చెందగా మృ తుడి కుటుంబాన్ని పరామర్శించారు. వెంట జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంపత్‌ ఉన్నారు.


logo