గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jan 09, 2020 , 19:06:38

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు

తాడ్వాయి : మేడారం సమ్మక్క-సారక్కల మహాజాతరలో భాగంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆర్‌ఎం శ్రీధర్‌ అన్నారు. మేడారంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో వెల్ఫేర్‌ కమిటీతో జాతర సందర్భంగా తీసుకునే చర్యలు, చేపట్టాల్సిన జాగ్రత్తలపై వరంగల్‌ రీజియన్‌లోని సూపర్‌వైజర్లు, డీఎం లు, అసిస్టెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడారు. జాతర సందర్భంగా ఏర్పడే వాహనాల రద్దీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. బస్సులలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. మేడారానికి వచ్చే బస్సులు, వివిధ ప్రాంతాలకు తిరిగి వెళ్లే బస్సులను పంపించే విధానాన్ని వారికి వివరించారు.

పనులను పరిశీలించిన విజిలెన్స్‌ బృందం
భక్తుల సౌకర్యార్థం మేడారం జాతర పరిసరాల్లో పలు శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బుధవారం విజిలెన్స్‌ అధికారులు తుల రవి, సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు నిర్మాణంలో వేగం పెంచి పూర్తి చేయాలని, తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని సూచించారు. జాతరకు కొద్ది రోజుల సమయమే ఉన్నందున యంత్రాలు, కూలీల సంఖ్యను పెంచి పనులను పూర్తి చేయాలన్నారు.


logo