e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home మూవీ ముచ్చట్లు ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?

ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?

ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?

ప్రతీ శుక్రవారం మాదిరే ఈ వారం కూడా చాలా కొత్త సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. ఒకటి రెండు కాదు.. మార్చి 5న ఏకంగా 9 సినిమాలు విడుదలయ్యాయి. అందులో మూడు నాలుగు సినిమాలలో మాత్రమే తెలిసిన నటులు ఉన్నారు.. మిగిలిన సినిమాలు అంతా కొత్తవాళ్లతోనే తెరకెక్కాయి. అవి విడుదలవుతున్నాయని నిర్మాతలు చెప్పేంత వరకు తెలియని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ వారం వచ్చిన 9 సినిమాలలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలేంటి.. ఏది విజేతగా నిలిచింది అనేది చూద్దాం.. 

సందీప్ కిషన్ A1 ఎక్స్‌ప్రెస్

SK25 అంటూ హడావిడి చేసిన ఈ చిత్రానికి టాక్ ఊహించినంత రాలేదు. స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిన ఎమోషన్ మిస్ అయిందంటున్నారు ఆడియన్స్. 

రాజ్ తరుణ్ పవర్ ప్లే

సీరియస్ కథతో వచ్చినా కూడా స్క్రీన్ ప్లే లోపాలతో పవర్ లెస్ ప్లేగా మారిపోయింది ఈ చిత్రం. 

హరిప్రసాద్ జక్కా ప్లే బ్యాక్

ఈ వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకున్న చిన్న సినిమా ఇది. హరిప్రసాద్ జక్కా తెరకెక్కించిన ఈ చిత్రం టైమ్ కనెక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. 

దిల్ రాజు షాదీ ముబారక్

చక్రవాకం సీరియల్ హీరో సాగర్ నటించిన ఈ సినిమాకు టాక్ చాలా బాగుంది. అయితే ప్రమోషన్ చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంది. 

రాజేంద్రప్రసాద్ క్లైమాక్స్

దేశాన్ని దోచేసిన వ్యాపార వేత్తల కారెక్టర్స్ నుంచి స్పూర్తి పొంది తెరకెక్కిన సినిమా క్లైమాక్స్. రాజేంద్రప్రసాద్ నటించిన ఈ చిత్రం మెప్పించడంలో విఫలమైంది. 

A:

సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన ఈ చిత్రానికి టాక్ చాలా బాగుంది. కాకపోతే ప్రమోషన్ కరువు అయిపోయింది.

నందమూరి తారకరత్న దేవినేని

ఈ సినిమా విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. 

రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ (ఇంగ్లీష్ డబ్బింగ్)

తెలుగు సినిమాల హడావిడిలో హాలీవుడ్ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.

సీత ఆన్ రోడ్స్ (జీ ప్లెక్స్.. ఓటీటీ రిలీజ్)

ఈ ఓటీటీ సినిమా కాస్త ల్యాగ్ అయిందనే టాక్ తెచ్చుకుంది.

Advertisement
ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement