e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 12, 2021
Advertisement
Home టాప్ స్టోరీస్ తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా

తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా

తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా

శిష్యులు ప్రయోజకులు అయినప్పుడు ఆ గురువు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుకుమార్ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ లెక్కల మాస్టారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన చాలామంది ఇప్పుడు మెగాఫోన్ పడుతున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడితో సినిమా అంటే హీరోలు కూడా ముందు వెనుక ఆలోచించకుండా సరే అంటున్నారు. దానికి కారణం ఈ మధ్య విడుదలైన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా. ఈ చిత్రంతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈయన సుకుమార్‌కు ప్రియ శిష్యుడు. గురువు గారి పేరు నిలబెడుతూ తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. 

దానికి ముందు సుకుమార్ స్కూల్ నుంచి వచ్చి ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు సూర్య ప్రతాప్. ప్రస్తుతం ఈయన గీతా ఆర్ట్స్ సంస్థలో నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్లే బ్యాక్ సినిమా దర్శకుడు హరి ప్రసాద్ జక్కా కూడా సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా  పని చేశాడు. చిన్న సినిమా అయినా దీనికి మంచి టాక్ వచ్చింది. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. 

ఇప్పుడు రానా దగ్గుబాటి హీరోగా వెంకీ అనే కొత్త దర్శకుడు ఒక ప్రేమకథ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఈయన కూడా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు రానా. దీనికి కూడా సుకుమార్‌ సహాయ సహకారాలు ఉంటాయని నమ్ముతున్నాడు రానా దగ్గుబాటి. ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సుకుమార్ శిష్యుల హవా నడుస్తుంది.

Advertisement
తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement