ప్రముఖ నిర్మాత,ఆర్కే ఫి లిమ్స్ అసోసియేట్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్‌రావు(81) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుకు కృష్ణమోహన్‌రావు అన్నయ్య అవుతారు. ఆర్కే ఫిలిమ్ అసోసియేట్స్ బ్యానర్‌పై సోదరుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భలేకృష్ణుడు, అపూర్వ సహోదరులు, యుద్దభూమి, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, ఘరానా బుల్లో డు,బొంబాయి ప్రియుడు, ఇద్దరు మిత్రులుతో పాటు పలు విజయవంతమైన చిత్రాల్ని కృష్ణమోహన్‌రావు నిర్మించారు. ఆయన అంత్యక్రియలను గురువారం మహాప్రస్ధానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణమోహన్‌రావుకు భార్య వాణీతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.