e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home టాప్ స్టోరీస్ చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్

చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్

చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్

కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం అల్లు అరవింద్‌కు కొట్టిన పిండి. తెలుగు ఇండస్ట్రీలో రూ.30 కోట్లు పెట్టడమే గగనంలా చూస్తున్న స‌మ‌యంలోనే రూ.40 కోట్లు పెట్టి మగధీర సినిమాను చేశాడు అల్లు అరవింద్. ఎప్పుడూ పెద్ద సినిమాలు చేయడమే కాదు తన సంస్థలో చిన్న సినిమాలు కూడా నిర్మించడం ఈయన ప్రత్యేకత. గీతా ఆర్ట్స్ కాకుండా 2 అని మొదలు పెట్టి అందులో బన్నీ వాసు నిర్మాతగా వరసగా సినిమాలు నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. కాకపోతే ఈయన పేరు నిర్మాతగా కాకుండా సమర్పకుడిగా ఉంటుంది అందులో. 

చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్

తెలుగులో ఉన్న కుర్ర హీరోలంద‌రితో కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా వరసగా చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్నాడు అల్లు అరవింద్. అఖిల్, గోపీచంద్, నిఖిల్, కార్తికేయ లాంటి హీరోలు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారిప్పుడు. కార్తికేయ హీరోగా ‘చావు కబురు చల్లగా’ సినిమా వస్తుంది. ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నాడు. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.

చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్

మరోవైపు నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ సినిమాను కూడా ఇదే నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’‌ సినిమాను కూడా అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకుడు.

చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్

తాజాగా గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమాను నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. అన్నింటికి ఈయన సమర్పకుడిగానే ఉన్నాడు. గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమాలు వస్తున్నాయి. కానీ బయట బ్రాండ్ మాత్రం అల్లు అరవింద్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఏదేమైనా కూడా చిన్న సినిమాలతో వరసగా దండయాత్ర చేస్తున్నాడు మెగా ప్రొడ్యూసర్.

Advertisement
చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement