ముంబై : సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా అది అందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే బాలీవుడ్ భామ మలైకా అరోరా యోగ సెషన్ ముగిసిన తర్వాత బ్లాక్ వాటర్ బాటిల్‌తో బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్ టాప్, షార్ట్స్‌తో కనిపించిన మలైకా చేతిలో ఉన్న బ్లాక్ వాటర్ బాటిల్‌పై కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్ల చూపు పడింది. వడోదరకు చెందిన స్టార్టప్ రూ 100కు బ్లాక్ వాటర్ బాటిల్‌ను ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఆ బాటిల్‌ను చేతపట్టి మలైకా కంటపడటంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్లలో ఒకరు మీరు బ్లాక్ వాటర్ తాగుతారా అని ప్రశ్నించగా ఆమె నవ్వుతూ ఇది బ్లాక్ అల్కలీన్ వాటర్ అంటూ అక్కడి నుంచి కదిలారు. సాధారణ వాటర్ బాటిల్ ధర రూ 20 నుంచి రూ 40కి అందుబాటులో ఉండగా బ్లాక్ వాటర్ బాటిల్ రూ 100కు అందుబాటులో ఉంది.
ఇక అల్కాలీ ఆధారిత బ్లాక్ వాటర్ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని ఇందులో 70 రకాల మినరల్స్ ఉండటంతో అవి జీర్ణశక్తి, జీవక్రియలు మెరుగుపడేందుకు దోహదపడటంతో పాటు అసిడిటీని తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతాయని చెబుతారు. ఈ నీరు పీహెచ్ లెవెల్ ఏడు శాతం పైగా ఉండటంతో ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.