తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఈ మధ్య కాలంలో విడిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అందులో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. కొన్నేళ్ల కింద ఈయన తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. దాంతో మనోజ్ మరో పెళ్లి చేసుకుంటున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మూడేళ్ల పాటు సినిమాలు కూడా చేయలేదు మనోజ్. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన మనోజ్.. కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించలేదు. స్నేహితులతో కలిసి దేశమంతా తిరిగొచ్చాడు. ఆధ్యాత్మిక చింతనలోకి కూడా వెళ్లిపోయాడు. ఇన్నాళ్లకు మళ్లీ మామూలు మనిషి అయి సినిమాలు చేస్తున్నాడు.
ఈయన్ని కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా మనోజ్‌ను ఒప్పించి మరో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తున్నారు. ఈ మధ్యే భార్యతో విడాకుల ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. దాంతో త్వరలోనే మంచు వారబ్బాయి మరోసారి పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ ఎవర్ని చేసుకోబోతున్నాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
కొన్ని రోజుల కింద ఈయన ఓ టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని.. ఆమెనే రెండో పెళ్లి చేసుకుంటాడని వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని కుటుంబ సభ్యుల నుంచే సమాచారం వచ్చింది. కొడుకు పెళ్లి విషయంలో మోహన్ బాబు ఓ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. తమ కుటుంబానికి దగ్గరి బంధువైన ఓ అమ్మాయితోనే మనోజ్ పెళ్లి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిరితే మే నెలలోనే మనోజ్ రెండో పెళ్లి ఉండబోతుంది కూడా.
2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. మనస్పర్థల కారణంగా విడిపోయాడు. ఆ సమయంలో ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేస్తుండటం.. మనోజ్ ఇక్కడ ఉండిపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయే వరకు వచ్చాయని వార్తలొచ్చాయి. భార్యతో విడిపోయిన తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. ఇప్పుడు ‘అహం బ్రహ్మస్మి’తో వస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మరి మనోజ్ పెళ్లి వార్తల్లో నిజమెంత ఉందో చూడాలి.