గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ జేడీ, డీజే మణికంఠ నిర్మాతలు. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు క్రిష్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫస్ట్‌లుక్ వినూత్నంగా ఉంది. టీజర్‌తో పాటు రెండు పాటలు నన్ను ఆకట్టుకున్నాయి’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రెండున్నరేళ్ల కృషికి నిదర్శనమిది. రొటీన్‌కు భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కించాం. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జుడా శాండీ, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌రెడ్డి.