2020 అంతా కరోనాకు బలైపోవడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోయారు. ఎన్నో సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయని హీరోలు.. 2021లో మాత్రం రెండు సినిమాలు విడుదల చేస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సహా చాలా మంది హీరోలు ఈ ఏడాది డబుల్ డోస్ ఇవ్వబోతున్నారు. మరి రెండు సినిమాలతో రాబోతున్న హీరోలెవరో చూద్దాం..
1. పవన్ కళ్యాణ్: వకీల్ సాబ్, అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్
2. రవితేజ: క్రాక్, ఖిలాడీ
3. శర్వానంద్: శ్రీకారం, మహా సముద్రం
4. వెంకటేష్: నారప్ప, ఎఫ్ 3 , దృశ్యం 2
5. నాని: టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్
6. నితిన్: చెక్, రంగ్ దే
7. రానా: అరణ్య, విరాట పర్వం
8. రామ్ చరణ్: ట్రిపుల్ ఆర్, ఆచార్య
9. వరుణ్ తేజ్: గని, ఎఫ్ 3
10. విశ్వక్ సేన్: పాగల్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సినిమా, పీవీపీ సినిమా
11. నాగ శౌర్య: లక్ష్య, వరుడు కావలెను
12. శ్రీవిష్ణు: గాలి సంపత్, రాజారాజ చోర
13. ఆది సాయికుమార్: శశి, జంగిల్
14. చిరంజీవి: ఆచార్య, లూసీఫర్ రీమేక్