బిగ్‌బాస్ అంటేనే కేరాఫ్ కాంట్రవర్సీ.. అక్కడ వివాదం లేనిదే విషయం ఉండదు. ప్రతి విషయాన్ని వివాదంగా మార్చడమే బిగ్‌బాస్ నిర్వాహకుల పని. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టి టీఆర్పీ రేటింగ్ కోసం పీకులాట పెట్టించడమే బిగ్‌బాస్ కాన్సెప్ట్. ఇప్పటికే నాలుగు సీజన్లు తెలుగులో సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం ముస్తాబవుతోంది. గతేడాది కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలు ఆలస్యంగా మొదలైంది బిగ్‌బాస్. కానీ ఈసారి సరైన సమయానికి మొదలు కానుంది. అయితే బిగ్ బాస్ 5 తెలుగు కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.
ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మామూలుగా ఉండకూడదని.. వాళ్ల పేరు చెప్తే కాంట్రవర్సీ భరత నాట్యం చేయాలని భారీగానే ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాతో సహా ఎప్పుడు న్యూస్‌లో ఉండే మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీస్ కోసం వెతుకుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. నిజానికి ఈమె రెండో సీజన్ నుంచి కూడా బిగ్‌బాస్‌లోకి వస్తుందని ప్రచారం జరుగుతుంది. సీజన్ 2లో నాని హోస్ట్ కావడంతో శ్రీ రెడ్డికి అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత ఈమె తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ సీజన్ ఫైవ్ కోసం శ్రీ రెడ్డి పేరు వినిపిస్తుంది.
ఈమెతో పాటు మరికొందరు కాంట్రవర్షియల్ ఫిగర్స్ కోసం భారీగానే వేట సాగిస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. అనుకున్న దానికంటే టీఆర్పీ రేటింగ్స్‌లో గత సీజన్ వెనకబడింది. అందుకే కొత్త సీజన్ కోసం సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాబోయే బిగ్‌బాస్ సీజన్ పూర్తిగా వివాదాలతో కాంట్రవర్సీలతో నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా అక్కడ ఉండే మంటను మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. టిక్ టాక్ దుర్గారావు, సునీత, షణ్ముఖ్ జస్వంత్.. ఇలా కొందరి పేర్లు సీజన్ 5 కోసం వినిపిస్తున్నాయి. జూన్‌లో బిగ్ బాస్ కొత్త సీజన్ షురూ కానుంది.