శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medchal - Aug 23, 2020 , 23:48:48

లంబోదరుడికి పూజలు

లంబోదరుడికి పూజలు

బాలానగర్‌ : విత్తన గణపతులను పూజించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎంపీ సంతోష్‌రావు గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా.. ఓల్డ్‌బోయిన్‌పల్లిలో డివిజన్‌ కార్పొరేటర్‌ ముద్దం నర్సింహాయాదవ్‌తో కలిసి ఆయన విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వేబోర్డు సభ్యులు కర్రె జంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

కేపీహెచ్‌బీ కాలనీ : కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీనగర్‌ డివిజన్లలో గణనాథుడి పూజలు ఘనంగా జరిగాయి. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆయా కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్ల వెల్ఫేర్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాల్లో వినాయకుడి ప్రతిమలనున ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో సాదాసీదాగా మండపాలను ఏర్పాటు చేసి.. ఆర్భాటం లేకుండా పూజలు చేసి నిమజ్జన కార్యక్రమాలను మొదలుపెట్టారు.  

- కేపీహెచ్‌బీ కాలనీ గోపాల్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మం డపం వద్ద మొ దటి రోజు ప్రత్యేక పూజలు చేశారు. రెండోరోజు వినాయకుడి ని మజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో గోపాల్‌నగర్‌ కాలనీకి చెందిన బిక్కెన సాయి రూ.15,116 లకు లడ్డూను దక్కించుకున్నాడు.

బంజారాహిల్స్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలో కరోనా మహమ్మారి కారణంగా నవరాత్రి ఉత్సవలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇండ్లలోనే గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్‌,సోమాజిగూడ డివిజన్ల పరిధిలోని అన్ని బస్తీలు, కాలనీల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 

ఖైరతాబాద్‌: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పర్యావరణ హిత గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, సహా య కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్‌, కార్యవర్గసభ్యులు భూపాల్‌రెడ్డి, వీరగోని రజనీకాంత్‌, మైనార్టీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు పాల్గొన్నారు. 


కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ 

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు నిరుపేదలకు వరంలా మారాయని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లిలో డివిజన్‌ కార్పొరేటర్‌ ముద్దం నర్సింహాయాదవ్‌తో కలిసి ఆయన 62 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వేబోర్డు సభ్యుడు కర్రె జంగయ్య పాల్గొన్నారు.