శనివారం 31 అక్టోబర్ 2020
Medchal - Sep 28, 2020 , 00:47:02

లక్ష్యానికి మించి మొక్కలు నాటాం

లక్ష్యానికి మించి  మొక్కలు నాటాం

జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

ఘట్‌కేసర్‌:  హరితహారం కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లాలో లక్ష్యానికి మించి  మొక్కలు నాటామని  కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.  మండల పరిధిలోని మండలం మర్పల్లిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆదివారం కలెక్టర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని, అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, జిల్లా వ్యాప్తంగా  మొక్కలు నాటారని తెలిపారు.   తహసీల్దార్‌ విజయలక్ష్మి, సర్పంచ్‌ చిలుగూరి మంగమ్మ సాయిలు, ఎంపీటీసీ కందుల సరళ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.