బుధవారం 28 అక్టోబర్ 2020
Medchal - Sep 27, 2020 , 01:19:53

అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం

అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం

 పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మలారెడ్డి

ఘట్‌కేసర్‌ : ప్రజా సంక్షేమంతో పాటు , తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం సుమారు రూ. కోటి 85 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో బీటీ రోడ్డు , 2 వార్డులో పార్కు అభివృద్ధి పనులు, 7వ వార్డులో సీసీరోడ్డు నిర్మాణం, 9, 10 వార్డులో హరితహారం మొక్కల పెంపకం, పార్కు అభివృద్ధి, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం , 11, 12 వ వార్డులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం, 13వ వార్డులో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం, 14వ వార్డులో రోడ్డు మరమ్మతులు, 15,  17వ  వార్డులో వైకుంఠధామం అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ను, రూ.25 లక్షల మున్సిపాలిటీ అవసరాల కోసం కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లు, 2 ఆటోలను మంత్రి ప్రారంభించారు. చైర్‌పర్సన్‌ ముల్లి పావనీ జంగయ్యగౌడ్‌, కమిషనర్‌ వసంత, వైస్‌చైర్మన్‌ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి బర్ల రాధకృష్ణ ముదిరాజ్‌, నాయకులు ముల్లి జంగయ్య యాదవ్‌, బొక్క ప్రభాకర్‌ రెడ్డి, బర్ల హరిశంకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి..

ఘట్‌కేసర్‌: సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శనివారం ఘట్‌కేసర్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రతినెల రూ.339 కోట్లు మంజూరు చేస్తూ, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, రైతు సొసైటీ చైర్మన్‌ రాంరెడ్డి,  వైస్‌ ఎంపీపీ కె. జంగమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్య యాదవ్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
 


logo